సౌందర్య ప్రొడ్యూస్ చేసిన ఏకైక మూవీ అదేనా..?

murali krishna
తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో మహానటి సావిత్రి తర్వాత అంతటి అందం అభినయం గల నటిగా సౌందర్య మంచి గుర్తింపు పొందింది.. అద్భుతమైన నటనతో అందరి ఫేవరెట్ హీరోయిన్ అయింది... హోమ్లీ పాత్రలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈమె గ్లామర్ ప్రపంచంలో కూడా తన స్థాయిని ఏమాత్రం తగ్గించుకోకుండా తాను పెట్టుకున్న నియమాలతోనే సౌందర్య స్టార్ హీరోయిన్ గా రానించింది.సౌందర్య ఒకప్పటి స్టార్ హీరోలందరి సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది..ముఖ్యంగా చిరంజీవిని,వెంకటేష్, నాగార్జున, బాలయ్య వంటి అప్పటి టాప్ స్టార్స్ తో సౌందర్య వరుస సినిమాలు చేసి ఎంతో గుర్తింపు సంపాదించింది..ఇలా ఎంతోమంది హీరోలతో జతకట్టిన ఈ అందాల బొమ్మ నేడు మన మధ్య లేకపోయినా ఆమె చిత్రాలు మాత్రం ఎప్పటికీ ప్రేక్షకులను గుర్తుండిపోతాయి. సౌందర్య పుట్టింది కర్ణాటకలో అయినా కూడా అచ్చమైన తెలుగు అమ్మాయిలా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్రలలో నటించింది..


సౌందర్య తండ్రి నిర్మాతగా, రైటర్ గా రాణించారు. దీనితో తండ్రి ద్వారా సౌందర్య సినిమాలలోకి అడుగుపెట్టింది..బాలనటిగా సౌందర్య సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.. స్కూల్ కి వెళ్తూనే మూవీ షూటింగ్ కి హాజరు అయ్యేది.. అయితే మొదట సౌందర్య సినిమాలలోకి రావడం ఇష్టం లేదు..తండ్రి కోసం నటించాల్సి వచ్చింది.ఆ తర్వాత వేరే ప్రత్యామ్నాయం లేక నటిగా మారాల్సి వచ్చింది.మంచి అవకాశాలు రావడంతో చదువుని పక్కన బెట్టి సినీ ఇండస్ట్రీ లో హీరోయిన్ గా ఎన్నో గుర్తిండి పోయే పాత్రలలో నటించి మెప్పించింది. అలా కెరీర్ పీక్స్ లో వుండే సమయంలోనే తన తండ్రి మరణ వార్త ఆమెను క్రుంగదీసింది. తన తండ్రి కోసం ఏదోకటి చేయాలనే ఉద్దేశంతో నిర్మాతగా మారింది.. నాన్న పేరుతోనే మూవీ బ్యానర్ స్టార్ట్ చేసింది.సౌందర్య సత్యం మూవీ మేకర్స్ పేరుతో 2002లో ద్వీప అనే సినిమాను కన్నడలో తెరకెక్కించింది. గిరీష్ కాసరవల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫిమేల్ ఓరియంటెడ్ గా తెరకెక్కించారు. ఇందులో సౌందర్య ప్రధాన పాత్ర పోషించారు. పేదల జీవితాలను ఆవిష్కరించే కథాంశంతో వచ్చిన ఈ సినిమా భారీ విజయం సాధించలేదు కానీ కానీ పర్వాలేదు అనిపించుకుంది. విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: