రేవంత్ ఎవరో నాకు తెలీదు..పరువు తీసిన మన్మోహన్ సింగ్ భార్య ?
ఈ సందర్భంగా సంతాప తీర్మానాన్ని రేవంత్ రెడ్డి ప్రవేశం పెట్టడం జరిగింది. అనంతరం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన తర్వాత... ఢిల్లీకి వెళ్లిన తర్వాత... ఆయన సతీమణి ని కలిశారట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా... తాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని... తానే పరిచయం చేయించుకున్నట్లు అసెంబ్లీ వేదికగా వెల్లడించారు రేవంత్ రెడ్డి.
ప్రత్యేక పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగిందని... ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. అయితే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. మొన్న అల్లు అర్జున్ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇక ఇప్పుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భార్య దగ్గర కూడా తనకు తానే ముఖ్యమంత్రి అని చెప్పుకునే పరిస్థితి వచ్చిందని రేవంత్ రెడ్డి పై సెటైర్లు పేల్చుతున్నారు నేటిజన్స్. అటు ఈ విషయాన్ని గులాబీ పార్టీ కూడా తెగ వాడేసుకుంటుంది. అసెంబ్లీలో ఎలా మాట్లాడాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియదంటూ... గులాబీ నేతలు చురకలాంటిస్తున్నారు. తన పరువు తానే తీసుకుంటున్నాడని ఎద్దేవా చేస్తున్నారు.