సారా టెండూల్కర్ ఈమె పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కూతురుగా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. సారా ఒక బాలీవుడ్ అందగత్తెకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది. ఈ క్రేజీ డాటర్ కి సోషల్ మీడియాలో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో సారా ఏదైనా పోస్ట్ పెట్టిందంటే చాలు సునామిలా వైరల్ అవుతూ ఉంటాయి. ఇంటర్నెట్ క్వీన్ గా సారా ఓ వెలుగు వెలుగుతోంది.
ఇన్ స్టాలో పది లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉండడం విశేషం. ప్రతిరోజు తన ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సారా ఆస్ట్రేలియాలో ఓ వెలుగు వెలిగింది. అక్కడి బీచ్ లో ఎంజాయ్ చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ మ్యాచ్ ల కోసం ఆసీస్ లో సారా వాలిపోయింది. మూడో టెస్ట్ లో ఆమె స్టేడియంలో మెరిసింది.
భారత జట్టు ఆటగాళ్లను ఎంకరేజ్ చేస్తూ కనిపించింది. ఆ మ్యాచ్ లో ఆమె మీద కెమెరామెన్ లు ఎక్కువగా ఫోకస్ చేశారు. మ్యాచ్ అనంతరం బ్యాటర్ శుబ్ మన్ గిల్ ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్ లో సారా దిగిన ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి గిల్, సారా ప్రేమలో ఉన్నారంటూ అనేక రకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఈ వార్తలపై ఎవరో స్పందించలేదు.
వీరిద్దరూ కలిసి బయట రెస్టారెంట్లలో చాలా సందర్భాలలో కెమెరా కంట పడ్డారు. వీరిద్దరూ మరోసారి కలిసి ఫోటోలు దిగడం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇప్పుడు సంద్రంలో సందడి చేస్తూ కనిపించింది. సారా బోటు వేసుకొని హుషారుగా సముద్రంలో రైడ్ చేస్తూ హల్చల్ చేసింది. ఆమె ఫోటోలు, వీడియోలు చూసిన అభిమానులు వెకేషన్ అదిరింది సూపర్ సారా అంటూ క్రేజీగా కామెంట్స్ పెడుతున్నారు.