చరణ్ కి యాటిట్యూడ్.. బన్నీకి బలుపు.. కరివేపాకుగాళ్లంటూ మాధవి లత ఫైర్.?

Pandrala Sravanthi
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అల్లు అర్జున్ కి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ చేస్తున్నారు.దానికి కారణం ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాక ఆయనపై చాలా నెగెటివిటీ పెరిగిపోయింది.ఆయనకు సంబంధించిన పాత వీడియోలను కూడా వైరల్ చేస్తూ చూడండి బన్నీకి ఎంత బలుపు ఉందో..ఎంత ఆటిట్యూడ్ ఉందో..ఎలా చేస్తున్నాడో చూడండి.. అటు చూస్తున్నాడు ఇటు చూస్తున్నాడు అంటూ ఇలా పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతూ వీడియోలు షేర్ చేస్తున్నారు. అయితే తాజాగా అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న నెగిటివిటీ పై మాధవి లత ఓ వీడియో ద్వారా మాట్లాడుతూ ఫైర్ అయింది.ఎవరైతే అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తున్నారో వారి గురించి ఒక పెద్ద వీడియో పెట్టింది.ఇక ఆ వీడియోలో మాధవి లత ఏం మాట్లాడిందంటే.. ఏంట్రా మీరు ఎవర్రా మీరు.. అల్లు అర్జున్ కి బలుపు ఉంది. 

యాటిట్యూడ్ ఉంది. పక్క చూపులు చూస్తున్నాడు. కింది చూపులు చూస్తున్నాడు అని మాట్లాడుతున్నారు.కరివేపాకు గాళ్లు మీకే అంత బలుపు ఉంటే ఆడికి ఉండకూడదా.. అల్లు అర్జున్ పుట్టడమే గోల్డెన్ స్పూన్ కాదు ఓ డైమండ్ స్పూన్ తో పుట్టాడు. అలాంటి వాడికి బలుపు ఉండకుండా ఆటిట్యూడ్ ఉండకుండా ఇంకా ఏం ఉంటుంది. మీలాంటి చెత్త వాగుడు వాళ్లకే బలుపు ఉన్నప్పుడు అలాంటి ఆయనకు ఉండకూడదా.. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అల్లు అర్జున్ కి సంబంధించిన వీడియోలు పెట్టి తెగ ట్రోల్ చేస్తున్నారు. అసలు మీరేంతరా వేపాకు గాళ్ళు.. మీరేం చేస్తారురా.. అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ పాల్గొన్నప్పుడు మీరు ఎందుకు ఇంత ఆటిట్యూడ్ చూపిస్తారు అని  యాంకర్ అడిగితే.. ఎందుకు నేను ఆటిట్యూడ్ చూపించకూడదా అని సమాధానం ఇచ్చాడు. 

చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కాబట్టి ఆయన ఆటిట్యూడ్ చూపించినప్పుడు అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్ కదా ఆయన కూడా బలుపు చూపించవచ్చు. ఆయన ఏం చూపిస్తే మీకెందుకురా.. మధ్యలో వేపాకు గాళ్ళు.. అల్లు అర్జున్ అంటే ఇష్టం లేని యాంటీ ఫ్యాన్స్ అందరూ నీ అంతు చూస్తాం.. నీ బలుపు దించుతాం అంటూ అల్లు అర్జున్ గురించి పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తున్నారు.మీరు ఏం చేస్తారు రా మీకు ఏమి చేతకాదు. ఇప్పుడు అల్లు అర్జున్ ని ట్రోల్ చేసిన వాళ్లే మీ ఫేవరెట్ హీరో విషయం వస్తే మా హీరో దేవుడు అని చెప్పుకుంటారు అంటూ మాధవి లత అల్లు అర్జున్ పై నెగిటివ్ ట్రోలింగ్ చేసే చాలామంది అల్లు హేటర్స్ కి ఇచ్చి పడేసింది. ప్రస్తుతం మాధవి లత మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన చాలా మంది అల్లు అభిమానులు ఈ వీడియోని వైరల్ చేస్తూ అల్లు అర్జున్ ని ట్రోల్ చేసేవారికి ట్యాగ్ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: