వెంకటేష్ రాజేంద్రప్రసాద్ మధ్య గొడవలు.. షూటింగ్లోనే కొట్టుకున్నారా.?

Pandrala Sravanthi
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరో వెంకటేష్ అంటే తెలియని వారు ఉండరు. ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నా కానీ ఎప్పుడు ఎలాంటి ఫీలింగ్ చూపించకుండా ఇండస్ట్రీ లో దూసుకుపోతున్నారు. అలాంటి వెంకటేష్  కామెడీ, యాక్షన్ ఏ పాత్రలో అయినా ఇట్టే దూసుకుపోతారు. అలా వెంకటేష్ కెరియర్ లో అద్భుతమైనటువంటి చిత్రంగా నిలిచినటువంటి మూవీ చంటి. ఈ సినిమా వెంకటేష్ చేయడం వెనుక చాలా పెద్ద చరిత్ర ఉందట.  ఈ సినిమా సమయం లో వెంకటేష్ కు మరియు కామెడీ హీరో రాజేంద్ర ప్రసాద్ కు మధ్య గొడవ జరిగిందని తెలుస్తోంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. తమిళంలో వచ్చినటు వంటి చిన్నతంబి సినిమా ను చంటి పేరు తో రాజేంద్ర ప్రసాద్ తెలుగు లో రీమేక్ చేయాలని భావించారట. కానీ అప్పటికే ఈ సినిమా రైట్స్ ను వెంకటేష్ తండ్రి రామానాయుడు తీసుకున్నారని  తెలిసిందట. 

 ఈ విషయం లో రామానాయుడుకు రాజేంద్ర ప్రసాద్ కు కాస్త మనస్పర్ధలు రావడంతో అందులో వెంకటేష్ ఎంటర్ అయ్యారట.  దీంతో వెంకటేష్ కు మరియు రాజేంద్రప్రసాద్ కు మధ్య కాస్త దూరం పెరిగి వీరు చాలా రోజులు మాట్లాడలేదని అప్పట్లో వార్తలు వినిపించాయట. చంటి సినిమా ను రవి రాజా పినిశెట్టి తెరకెక్కించారు. అయితే ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా వెంకటేష్ నటన టాలెంటును బయటపెట్టింది.

ఈ సినిమా కు నంది అవార్డు కూడా వచ్చింది. ఈ మూవీ తర్వాత వెంకటేష్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. కానీ ఈ సినిమా తర్వాత రాజేంద్రప్రసాద్ కు వెంకటేష్ కు మధ్య కొన్నాళ్లపాటు మాటలు లేవట.  ఆ తర్వాత అంతా సెట్ అయిపోయి వీరి మధ్య మాటలు కలిశాయని తెలుస్తోంది. ఏది ఏమైనా ఒకరు అనుకున్న సినిమాను మరొకరు చేయడం ఇండస్ట్రీలో కామన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: