సినిమాలోకి రోజా కూతురు ఎంట్రీ ఇవ్వనున్నారా.. ఆమె క్లారిటీ ఇచ్చేశారుగా!

Reddy P Rajasekhar

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో, చురుకైన మాటతీరుతో నటి రోజా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఆమెకు ఇప్పటికీ ప్రేక్షకుల మద్దతు, అభిమానం మెండుగా ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా ఆమె కుమార్తె అన్షు మాలిక సినీ రంగ ప్రవేశం గురించి సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందం, తెలివితేటలు పుష్కలంగా ఉన్న అన్షు మాలిక త్వరలోనే వెండితెరపై మెరుస్తుందని చాలామంది భావించారు. అయితే ఈ ఊహాగానాలకు రోజా తాజాగా పుల్‌స్టాప్ పెట్టారు.

అన్షు మాలికకు నటి కావాలనే ఆసక్తి అస్సలు లేదని రోజా స్పష్టం చేశారు. ఆమె లక్ష్యం సినిమా గ్లామర్ ప్రపంచం కాదని, సైంటిస్ట్ కావాలనేది తన కుమార్తె కల అని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం అన్షు మాలిక అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తోందని, అక్కడ పరిశోధనలపై పూర్తి దృష్టి సారించిందని రోజా పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తు విషయంలో తను ఎప్పుడూ ఒత్తిడి తీసుకురానని, వారికి నచ్చిన రంగాన్ని ఎంచుకునే పూర్తి స్వేచ్ఛను ఇచ్చానని ఆమె తెలిపారు. అన్షు తీసుకున్న నిర్ణయం పట్ల తల్లిగా తాను గర్వపడుతున్నానని రోజా వివరించారు.

ఇదే సమయంలో అన్షు మాలిక వ్యక్తిగత జీవితంపై వస్తున్న కొన్ని పుకార్లను కూడా రోజా ఖండించారు. ఒక స్టార్ హీరో కుమారుడితో అన్షు పెళ్లి జరగబోతుందంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు. అసలు ఆ హీరో ఎవరో చెబితే తాను కూడా తెలుసుకుంటానని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ, ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు. చదువుపై అమితాసక్తి చూపే అన్షు మాలిక, భవిష్యత్తులో శాస్త్రవేత్తగా సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షిస్తోందని రోజా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రోజా సినిమాల్లో, రాజకీయాల్లో రీఎంట్రీ ఇచ్చి కెరీర్ పరంగా సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: