ఆ దర్శకుడి చేతిలో పడ్డ టాలీవుడ్‌ కొత్త హీరోయిన్‌..?

Veldandi Saikiran
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో తన సత్తాను చాటుతోంది భాగ్యశ్రీ బోర్సే. మొదట బాలీవుడ్ లో యారియాన్ 2 సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మంచి సక్సెస్ అందుకుంది. అనంతరం టాలీవుడ్ లో మాస్ మహారాజ్ రవితేజతో కలిసి మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్గా అవకాశాన్ని అందుకుంది. మిస్టర్ బచ్చన్ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ కాకపోయినప్పటికీ ఈ బ్యూటీకి మాత్రం మంచి సక్సెస్ వచ్చింది. ముఖ్యంగా మిస్టర్ బచ్చన్ సినిమాలో అమ్మడి గ్లామర్ షోకి కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. 

అందుకే ఆడియన్స్ లో ఈ బ్యూటీకి విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇప్పటికే విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్న భాగ్యశ్రీ ఆ సినిమాతో మంచి సక్సెస్ అందుకునేలా ఉందని టాక్ వినిపిస్తోంది. విజయ్ సినిమాలో హీరోయిన్స్ కి మంచి ప్రాధాన్యత ఉంటుంది. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పైన భారీ హైప్ పెరుగుతోంది. మరోపక్క దుల్కర్ సల్మాన్ తో కాంతా సినిమా కూడా చేస్తోంది ఈ బ్యూటీ.

తెలుగు, తమిళ్ భాషలలో తెరకెక్కనున్న ఈ సినిమాతో భాగ్యశ్రీ మంచి సక్సెస్ అందుకోనుంది. ఓవైపు విజయ్, మరోవైపు దుల్కర్ వీరిద్దరితో భాగ్యశ్రీ స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. ఈ రెండింటిలో ఏ ఒక్క సినిమా హిట్ అయినా కచ్చితంగా భాగ్యశ్రీకి మంచి సక్సెస్ అందుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే భాగ్యశ్రీ బోర్సే వరుసగా ఫోటోషూట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటుంది.

ఓ వైపు సినిమాలు, మరోవైపు ఫోటోషూట్లు ఈ రెండింటిలో ఈ బ్యూటీని చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఒక సినిమా హిట్ పడితే మాత్రం అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లో నిలుస్తుందని అంటున్నారు. ఈ రెండు సినిమాల అనంతరం భాగ్యశ్రీ... త్రివిక్రమ్ సినిమాలో నటించబోతుందట. మరి భాగ్యశ్రీని తెలుగు అభిమానులు ఆదరిస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: