వావ్: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.కల్కి చిత్రానికి అరుదైన ఘనత..!

Divya
ఈ మధ్యకాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి విడుదలైన చిత్రాలు ఏదో ఒక సందర్భంలో టాప్ లో నిలుస్తూ ఉన్నాయి. అలా ఇప్పటివరకు ఎన్నో చిత్రాలు కూడా ఏదో ఒక అరుదైన రికార్డును కానీ ఘనతలను కానీ అందుకు ఉన్నాయి. ఇండియన్ మూవీ డేటా బేస్ సంస్థలు ఎప్పటికప్పుడు పలు రకాల సర్వేలను సైతం చేపడుతూ ఉంటారు. అందుకు సంబంధించిన విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటారు. తాజాగా ఇండియాలో మోస్ట్ పాపులర్ సినిమాలలో ఒక లిస్టును సైతం ఐఎండీబీ విడుదల చేసింది.

2024 సంవత్సరానికి గాను ఈ లిస్టులో విడుదల చేయగా ఇందులో ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాలు సైతం చూస్తే ఈ లిస్టులో కల్కి సినిమా ప్రథమ స్థానం అందుకున్నది. ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన కల్కి 2898AD సినిమా అరుదైన ఘనతను అందుకుంది. ఐఎండిబి లో అత్యంత ప్రదాచారణ పొందిన కేవలం 10 చిత్రాలలో కల్కి సినిమా మొదటి స్థానం అందుకున్నదట. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా తెలియజేస్తూ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ఈ విషయం తనకు చాలా ఆనందాన్నిస్తోంది అంటు తెలియజేస్తూ ఒక పోస్ట్ ని షేర్ చేశారు. ఇందులో అమితాబ్ బచ్చన్, కమలహాసన్, దీపికా పదుకొనే తదితరు నటీనటులు సైతం కీలకమైన పాత్రల నటించారు సుమారుగా ఈ సినిమా రూ .1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ప్రభాస్ కెరియర్ లో మరొక రికార్డును నెలకొంది. మొత్తానికి ప్రభాస్ అభిమానులకు కల్కి సినిమాతో మరొక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఈ ఏడాది అత్యంత ప్రజాదారణ పొందిన చిత్రంగా నిలచడంతో అభిమానులు ఈ విషయాన్ని తెగ వైరల్ గా చేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ సినిమాలో నటిస్తూ ఉన్నారు. అలాగే సలార్ 2, కల్కి-2 సినిమాలు చేయాల్సి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: