Sukumar:సౌత్ కొరియాలో సుకృతి సెన్సేషన్.. ఇంటర్నేషనల్ స్టేజ్‌పై అదుర్స్!

Amruth kumar
టాలీవుడ్‌లో ‘లెక్కల మాస్టర్’గా పిలుచుకునే సుకుమార్ సృష్టించిన ‘పుష్ప’ ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . . . బాక్సాఫీస్ దగ్గర రికార్డులను తిరగరాయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య .. అయితే, ఇప్పుడు సుకుమార్ బ్రాండ్‌ను వరల్డ్ లెవల్‌కు తీసుకెళ్లే బాధ్యతను ఆయన తనయ సుకృతి సుకుమార్ భుజానికెత్తుకుంది . . చిన్నప్పుడే ‘గాంధీ తాత చెట్టు’ సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న ఈ చిన్నది, ఇప్పుడు సింగర్‌గా సౌత్ కొరియాలో జెండా పాతేసింది. .



సాధారణంగా ఒక డైరెక్టర్ కూతురు అంటే యాక్టింగ్ వైపు వెళ్తుందనుకుంటారు, కానీ సుకృతి మాత్రం తన వాయిస్‌తో ప్రపంచాన్ని మెప్పించాలని డిసైడ్ అయ్యింది. . .సౌత్ కొరియాలోని జేజులో జరిగిన AMIS కాన్సర్ట్‌లో సుకృతి మెయిన్ సింగర్‌గా పెర్ఫార్మ్ చేసింది. ఒక ఇంగ్లీష్ సాంగ్‌ను హాలీవుడ్ టాప్ సింగర్స్ రేంజ్‌లో పాడి అక్కడ ఉన్న విదేశీయులను సైతం ఆశ్చర్యపరిచింది . .. తన కూతురు ఇంటర్నేషనల్ స్టేజ్ మీద పాడుతున్న వీడియోను చూసి సుకుమార్ పరవశించిపోయారు. "నాకు చాలా గర్వంగా ఉంది.. సుకృతి డెడికేషన్, ప్రాక్టీస్ తనని ఈ స్థాయికి చేర్చాయి" అంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.  . .



సుకృతి ప్రయాణం చూస్తుంటే ‘తండ్రికి తగ్గ తనయ’ అనిపిస్తోంది. . సుకృతి చిన్న వయసులోనే ‘గాంధీ తాత చెట్టు’ చిత్రంలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది . . . ఆ సినిమాకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా జాతీయ అవార్డు గెలుచుకోవడం విశేషం . .కేవలం నటనకే పరిమితం కాకుండా, సంగీతంపై ఉన్న మక్కువతో హాలీవుడ్ స్టైల్ సింగింగ్‌ను ప్రాక్టీస్ చేసి, ఇప్పుడు ఏకంగా విదేశీ గడ్డపై తన గొంతు వినిపించింది. ఆమె పాడుతుంటే అచ్చు హాలీవుడ్ సింగర్ పాడుతున్నట్లే ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు ..


https://www.instagram.com/reels/DV8i72nkz9c/

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: