మంచు ఫ్యామిలీలో జరిగిన వివాదంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. మనోజ్, మోహన్ బాబు మధ్య మొదలైన గొడవలు మీడియా మీద దాడి చేయడం వరకు వచ్చాయి. తాజాగా మీడియాపై జరిగిన దాడి అనంతరం కేసు మరో మలుపు తిరిగింది. ఈ దాడి నేపథ్యంలో మోహన్ బాబుపై పలు కేసులను పోలీసులు నమోదు చేశారు. అలాగే మంచు మనోజ్, విష్ణు ఇరువురు పదుల సంఖ్యలో బౌన్సర్లతో హంగామా సృష్టించారు. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకొని వారికి హెచ్చరికలు జారీ చేశారు.
దాడి కేసులో మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు. తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా అందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో మోహన్ బాబును పోలీసులు విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేశారు. అందుకు మోహన్ బాబు కొంత సమయం కావాలని కోరాడు. తాజాగా ఆయనకు ఇచ్చిన గడువు ముగిసిన కారణంగా విచారణకు పిలిచేందుకు మోహన్ బాబును వద్దకు వెళ్లగా అతని ఆచూకీ లభించడం లేదు.
కాగా కొద్ది రోజులుగా మోహన్ బాబు అజ్ఞాతంలో ఉన్నారని సమాచారం అందుతోంది. మోహన్ బాబు చంద్రగిరిలో ఉన్నారని సమాచారం రాగా అక్కడికి వెళ్లి పోలీసులు ఆరా తీశారు. దీంతో అక్కడ డిసెంబర్ 23న నుంచి మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లారని తెలిసిందట. ప్రస్తుతం మోహన్ బాబు అమెరికాలో తలదాచుకున్నారని ఎంబీయూ వర్గాలలో చర్చలు నడుస్తున్నాయి.
డిసెంబర్ 16వ తేదీ హైదరాబాద్ నుంచి చంద్రగిరిలో ఉంటున్న మోహన్ బాబు అరెస్టు భయంతో ఎవరికి చెప్పకుండా అమెరికాకి వెళ్లిపోయాడని వార్తలు వస్తున్నాయి. మోహన్ బాబును పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం అందుతుంది. అరెస్టు చేస్తారన్న భయంతోనే మోహన్ బాబు అమెరికాకు పారిపోయాడని కొంతమంది అంటున్నారు. ఈ వార్తలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.