అల్లు అర్జున్ ఇంటి ముందు సందడి చేస్తున్న ఫ్యాన్స్..!

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు ఇవాళ. అయితే ఈ సందర్భంగా అల్లు అర్జున్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అభిమానులతో పాటు చాలామంది సినీ సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఈరోజు అల్లు అర్జున్ కి ఇది చాలా స్పెషల్ డే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. పుష్ప సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న తర్వాత అల్లు అర్జున్ తన మొదటి పుట్టినరోజు ను సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. దాంతోపాటు ఈ సంవత్సరమే పుష్ప టూ

 సినిమా సైతం విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. దీంతో అల్లు అర్జున్ అభిమానులు నిన్న రాత్రి నుండే అల్లు అర్జున్ ఇంటి ముందు హడావిడి చేయడం ప్రారంభించారు. తమ అభిమాన హీరో పుట్టినరోజుని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే అల్లు అర్జున్కి స్వయంగా విషెస్ తెలపడానికి అల్లు అర్జున్ ఇంటికి దారులు తీరారు. ఇందులో భాగంగానే అల్లు అర్జున్ కు స్వయంగా పుట్టినరోజు విషెస్ తెలపడానికి ఇంటి ముందు హడావిడి చేస్తున్న పలు వీడియోలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా పుష్ప టు. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ తెరకెక్కిస్తున్న సీక్వెల్ ప్రాజెక్టులో కన్నడ భామ రష్మిక మందన్నా మరోసారి ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తోంది. శ్రీవల్లిగా డీగ్లామరైజ్‌డ్‌ రోల్‌లో కనిపించనుంది. పార్టు 2లో ఫహద్‌ ఫాసిల్, జగదీష్‌ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్‌ రాజ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, రావు రమేశ్‌, ధనంజయ, షణ్ముఖ్‌, అజయ్‌, శ్రీతేజ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాక్‌ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ మరోసారి ఫస్ట్‌ పార్టును మించిపోయేలా అదిరిపోయే ఆల్బమ్‌ రెడీ చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్‌...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: