ఇష్టం లేకపోయినా కొన్ని చేయాల్సి ఉంటుంది.. గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?
టీమ్ ఇండియా జట్టు తరఫున దాదాపు దశాబ్ద కాలానికి పైగా ప్రాతినిధ్యం వహించిన గౌతం గంభీర్ తన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. అయితే క్రికెట్ తో ఎంతలా అయితే గుర్తింపును సంపాదించుకున్నాడో.. కాంట్రవర్సీ లతో కూడా అంతే గుర్తింపును సంపాదించుకున్నాడు. ఎప్పుడు ముక్కు సూటిగా మాట్లాడుతూ ఏకంగా కెప్టెన్ సెలెక్టర్ల తీరుపై కూడా విమర్శలు చేసి వార్తల్లో నిలిచేవాడు. అయితే ఇక టీమిండియా కెప్టెన్ గా అతనికి అవకాశం రాకపోయినప్పటికీ ఐపీఎల్లో మాత్రం కోల్కతా కెప్టెన్గా అవకాశం వచ్చింది. ఇక అతని కెప్టెన్సీ లోనే ఓసారి కోల్కతా జట్టు టైటిల్ విజేతగా కూడా నిలిచింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు అదే కోల్కతా జట్టుకి మెంటర్ గా వ్యవహరిస్తున్నాడు గౌతమ్ గంభీర్.
ఈ క్రమంలోనే కెప్టెన్సీ చేపట్టినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అన్న విషయం గురించి ఇటీవల ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. నాయకుడిగా ఒక్కోసారి ఇష్టం లేని పనులు చేయాల్సి ఉంటుంది అంటూ గంభీర్ చెప్పుకొచ్చాడు. జట్టును ముందుండి నడిపించేటప్పుడు దూకుడైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇష్టం లేకపోయినా కొన్ని చేయాల్సి వస్తుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే నా కెరియర్ లో అలాంటివి కొన్ని జరిగాయి. కానీ అలా చేసి ఉండకపోతే నా జట్టు దూకుడుగా ఆడి ఉండేది కాదు. నిజజీవితంలో ప్రవర్తనను బట్టే ఆటగాళ్లను అంచనా వేయాలి అంటూ గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు.