ఈ ఒక్క విషయంతో.. ధోనికి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో తెలిసిపోతుందిగా?
ఈ క్రమంలోనే ధోని ఆధ్వర్యంలో ఋతురాజ్ కెప్టెన్సీలో చెన్నై జట్టు మంచి ప్రదర్శన చేస్తూ దూసుకుపోతుంది. ప్లే ఆఫ్ లో అడుగుపెట్టేలాగే కనిపిస్తుంది. అయితే ఇక ఈ సీజన్ ధోనీకి చివరి సీజన్ అంటూ ప్రచారం జరుగుతుండగా ధోని తన మెరుపు బ్యాటింగ్తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కానీ కొన్ని మ్యాచ్లలో మాత్రం చాలా లేటుగా ధోని బ్యాటింగ్ చేయడానికి వస్తున్నాడు. ఈ క్రమంలోనే ధోని తీరుపై అటు అభిమానులు కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఎలాగో చివరి సీజన్ అంటున్నారు. ఇలాంటి సమయంలో అయినా ధోని కనీసం ముందు బ్యాటింగ్ కి వచ్చి ఆడితే బాగుంటుంది కదా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ధోని ఇలా లేట్ బ్యాటింగ్ రావడం ఏంటి అని కొంతమంది మాజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలా ధోని కాస్త లేటుగా బ్యాటింగ్ రావడం పై విమర్శలు వస్తున్నాయి. అయితే తలా ఇలా ఎందుకు కాస్త ఆలస్యంగా బ్యాటింగ్ చేయడానికి వస్తున్నాడు అనే విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ధోనీకి తొడ కండరాలు గాయం ఉండడమే దీనికి కారణమట. ఐపీఎల్ కు ముందే ధోని కి గాయం ఉంది. వైద్యులు రెస్ట్ తీసుకోమని సూచించారట. అయితే కీపర్ కాన్వే కూడా అందుబాటులో లేకపోవడంతో ధోనీకి ఆడక తప్పడం లేదట. అందుకే వీలైనంత లేటుగా బాటింగ్ చేయడానికి వస్తున్నారు. పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ప్రతి మ్యాచ్ ఆడుతున్నారట ధోని.