టీమిండియా వరల్డ్ కప్ గెలవాలంటే.. అతను ఎంతో కీలకం : యువరాజ్
ఎందుకంటే మొదటి మ్యాచ్ నుంచి ఫైనల్ మ్యాచ్ వరకు కూడా ఒక్క ఓటమి కూడా ఎరగకుండా దూసుకుపోయింది టీమిండియా. దీంతో ఫైనల్లో కూడా గెలిచి చరిత్ర సృష్టిస్తుందని అందరూ భావించారు. కానీ ఊహించని రీతిలో ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి చివరికి అభిమానులు అందరిని కూడా నిరాశపరిచింది. అయితే ఇక ఇప్పుడు టీమిండియా దృష్టి వెస్టిండీస్, యుఎస్ వేదికలుగా జరగబోయే.. టి20 వరల్డ్ కప్ మీద ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఇటీవల బీసీసీఐ కూడా t20 వరల్డ్ కప్ ఆడబోయే జట్టు వివరాలను ప్రకటించారు. అయితే ఇదే విషయంపై ఎంతోమంది భారత మాజీలు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేస్తూ ఉన్నారు.
ఇదే విషయంపై భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ కూడా స్పందించాడు. టి20 వరల్డ్ కప్ ను టీమిండియా గెలవాలంటే కెప్టెన్ రోహిత్ శర్మ ఎంతో కీలకం అంటూ యువరాజ్ అభిప్రాయపడ్డాడు ఒత్తిడి ఎక్కువగా ఉండే టి20 వరల్డ్ కప్ లో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకునే కెప్టెన్ ఎంతో అవసరం. మనకు సరిగ్గా అలాంటి సారధి ఉన్నారు. ఎంత సక్సెస్ అయినా ఇప్పటికీ రోహిత్ లో మార్పు రాలేదు. మైదానంలో జట్టును ముందుండి నడిపిస్తాడు. మైదానం బయట కూడా అతను ఎంతో సరదాగా ఉంటాడు. ఇక క్రికెట్లో అతను నాకు ఎంతో ఆప్తుడు అంటూ యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు. కాగా జూన్ రెండవ తేదీ నుంచి వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే.