నా టైం అస్సలు బాలేదు.. పూజా హెగ్డే ఎమోషనల్ కామెంట్స్..!

Divya
టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించి, స్టార్ హీరోలతో జతకట్టిన పూజా హెగ్డే ఈ మధ్యకాలంలో పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. ముఖ్యంగా సరైన సక్సెస్ లేక సతమతమవుతోంది పూజ హెగ్డే. బాలీవుడ్ లో కూడా ఎన్నో చిత్రాలలో నటించిన అక్కడ కూడా సక్సెస్ కాలేదు. వీటికి తోడు కొన్ని సినిమాలలో పూజ హెగ్డేను తీసుకోగా కొన్ని కారణాల చేత ఆమెను తొలగిస్తున్నారు. ప్రస్తుతం పూజ హెగ్డే తెలుగులో ఎ ఒక్క సినిమా కూడా చేయలేదు. ఆమె నటించిన సినిమా తమిళ సినిమా జననాయగన్. ఈ సినిమా కూడా కొన్ని కారణాల చేత వాయిదా పడుతూ వస్తోంది.

 ప్రస్తుతం పూజ హెగ్డే తన కెరీర్లో టఫ్ టైమ్ నడుస్తోందని చెప్పవచ్చు. ఇటీవల ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పూజ హెగ్డే మాట్లాడుతూ తన కెరియర్ గురించి ఎమోషనల్ గా మాట్లాడింది. ప్రస్తుతం తన టైం అస్సలు బాలేదని, చేసిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ అవుతున్నాయి కొన్నేళ్లుగా నా లైఫ్ నుంచి సక్సెస్ అనే మాట కూడా దూరమైంది. అందుకే నా లైఫ్ లో ఇది చాలా ప్రత్యేకమైన సమయం ఇకనుంచి నేను చేసే సినిమాలు నాలోని నటన మీ అందరికీ పరిచయం చేస్తాయంట చెప్పుకొచ్చింది.



సినీ ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ లేని నాలాంటి అమ్మాయిలు ఇండస్ట్రీలో కొనసాగడం కూడా చాలా కష్టం కానీ ఆ సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రస్తుతం సిద్ధంగానే ఉన్నానని ఎమోషనల్ గా మాట్లాడింది. ప్రస్తుతం పూజ హెగ్డే చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా అభిమానులు సైతం ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా ఫేమ్ కామన్ అని , అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్లాలి అంటే కామెంట్స్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో పూజ హెగ్డే ఎలాంటి సినిమాలతో అభిమానులను అలరిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: