తెలంగాణ: మహిళలకు బిగ్ షాక్.. ఆధార్ కార్డు కాదు అది ఉంటేనే ఫ్రీ బస్..!

Pandrala Sravanthi
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు ఫ్రీ బస్ అనే పథకాన్ని తీసుకువచ్చింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందే ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చింది. అలా ఈ ఆరు గ్యారెంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉంది. అందుకే అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే మహిళలకు ఫ్రీ బస్సు సదుపాయం కల్పించింది. అయితే మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణం చేయాలంటే ఆధార్ కార్డు లేదా ఏదైనా ఐడెంటి కార్డు చూపించాలని నిబంధనలు పెట్టారు. మస్ట్ ఆధార్ కార్డు అని చెప్పారు.. అయితే ఇప్పుడు ఆధార్ కార్డుతో పని లేకుండా అది ఉంటేనే మహిళలు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం చేయగలరు అంటూ ప్రభుత్వం సంచలన విషయం తెలిపింది. మరి ఇంతకీ మహిళలు ఫ్రీ బస్ పథకాన్ని వినియోగించుకోవాలంటే వారి దగ్గర ఉండాల్సిన ఆ కార్డు ఏంటి..ఆధార్ కార్డుతో పని లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 


మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్న మహిళలకు తెలంగాణ గవర్నమెంట్ తాజాగా ఒక షాకింగ్ విషయాన్ని తెలిపింది.అయితే ఉచిత బస్సు ప్రయాణాన్ని చాలామంది ఫేక్ ఆధార్ కార్డులు వినియోగించుకుంటూ ఆర్టీసీని మోసం చేస్తున్నారు.కానీ వీటన్నింటినీ అడ్డుకోవడానికి తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది.అదేంటంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణానికి స్మార్ట్ కార్డులను జారీ చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని ఫేక్ ఆధార్ కార్డులతో ఇతర రాష్ట్రాల ప్రజలు వినియోగించుకుంటున్నారు. దీన్ని అరికట్టడం కోసమే తెలంగాణ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది అధికారులు ఫేక్ ఆధార్ కార్డులతో మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారు అనే విషయాన్ని గుర్తించారు.


ఇందువల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం పెరుగుతుంది. అందుకే ప్రభుత్వం స్మార్ట్ కార్డుల జారీని చేయాలని చూస్తున్నారట. అయితే మహిళలకు జారీ చేసే ఈ స్మార్ట్ కార్డులో లబ్ధిదారుల పేరు,అడ్రస్ తో పాటు ప్రత్యేకమైన ఐడి నెంబర్ కూడా ఉంటుందట. ఇక ఈ స్మార్ట్ ఐడి కార్డులు వచ్చాక బస్ కండక్టర్లు కూడా ఆ స్మార్ట్ ఐడి కార్డులను టికెట్ ఇష్యూయింగ్ మెషిన్ కి స్వైప్ చేసి టికెట్ ఇస్తారని తెలుస్తుంది. అలా అర్హులైన మహిళలకు ఈ స్మార్ట్ కార్డులను ఇవ్వడంతో పాటు ప్రభుత్వానికి కూడా ఫేక్ ఆధార్ కార్డుల బాధ తప్పి ఆర్థిక భారం తగ్గుతుంది. అయితే ఈ స్మార్ట్ కార్డులను త్వరలోనే ప్రభుత్వం జారీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే అప్పటి వరకు ఆధార్ కార్డుతో ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చని ప్రభుత్వం తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: