ఏపీ: కూటమి అధికారంలోకి వస్తే జరిగే పరిస్థితి..?

Divya
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడానికి బిజెపి పార్టీ మరొకసారి సిద్ధమయ్యిందనేలా కనిపిస్తోంది.. చంద్రబాబు, పవన్ ఇద్దరు కూడా కూటమిలో భాగం కావడంతో మరొకసారి చాలా బలంగానే విమర్శలు వినిపిస్తున్నాయి.. ఈసారి ఎన్నికలలో ఎలాగైనా గెలిచి అధికారంలోకి రావాలని అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా చాలా ఫిక్సయి పలు రకాల ప్రయత్నాలు వ్యూహాలను రచిస్తూ ఉన్నారు.. చివరికి బలం లేని బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుని నడిపిస్తున్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది కాబట్టి కూటమికి కలిసొస్తుందని భావన అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి ఉన్నప్పటికీ ప్రజలలో మాత్రం కనిపించడం లేదు.

కూటమి ఏపీని ముంచుతోందని కూడా తెలుపుతున్నారు.. ముఖ్యంగా ముస్లిం రిజర్వేషన్ల రద్దు విషయం పైన కూడా బిజెపి తన మేనిఫెస్టోలో తెలియజేసింది.. వీటిని అడ్డుకునే శక్తి చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కు లేదని మాత్రం చెప్పవచ్చు. కూటమిలో భాగంగా ఉన్నారు కాబట్టి మోది రిజర్వేషన్ తీసేస్తానంటే చంద్రబాబు ఏమి చేయలేరని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎన్నో తిప్పలు పడి కూటమిని ఏర్పరిచిన పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో మోడీని ప్రశ్నించలేరని కూడా చెప్పవచ్చు. ఈ సమయంలో తనని ఎవరైనా ప్రశ్నిస్తారా అని కూడా తెలిసి ముస్లిం మైనారిటీ ఉన్న నియోజకవర్గాలకు అసలు వెళ్లలేదట పవన్ కళ్యాణ్.

ఉమ్మడి మేనిఫెస్టో విషయానికి వస్తే విడుదల చేసిన రోజు బిజెపి తమకు ఈ మేనిఫెస్టో సంబంధం లేదని కూడా వెల్లడించింది. వాస్తవానికి కూటమిగా ఏర్పడిన పార్టీలు ఎక్కడైనా సరే ఉమ్మడిగా మేనిఫెస్టోని రిలీజ్ చేస్తూ ఉంటాయి.. ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఒకవేళ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకపోయినా వారిని అడిగే హక్కు చంద్రబాబు పవన్ కి కూటమికి ఓటేసిన ప్రజలు ఎవ్వరికీ కూడా ఉండదని భావన ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది.

మరొకవైపు పోలవరం విషయానికి వస్తే.. ప్రస్తుతం కూటమి అధికారంలోకి వస్తే రెండేళ్లలోపు పూర్తి చేస్తామంటూ అమిత్ షా వెల్లడించారు.. ఈ విషయం మోడీ నుంచి మాత్రం రాలేదు.. 2014లో ఇది జాతీయ ప్రాజెక్టు అని ప్రకటించిన బిజెపి.. ఆ మాత్రం వీటిని పూర్తి చేయలేదు. చంద్రబాబు పోలవరం రూపంలో ఆంధ్ర కి చేసిన ద్రోహం గురించి అందరికీ తెలిసిందే. ఈ విషయం పైన అటు చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ కు కూడా తీవ్రమైన విమర్శలు ఎదురయ్యాయి.
అందుకే కూటమిలో భాగంగా ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం, విశాఖ స్టీల్ ప్లాంట్, ముస్లిం రిజర్వేషన్లు ఇతరత్రా హామీలు ఏమి చెప్పలేదని ప్రజలు వాపోతున్నారు. మరి ఇలాంటి పరిస్థితులలో కూటమి అధికారంలోకి వస్తే ఏపీ పరిస్థితి వారి ఊహకే వదిలేస్తున్నామని పలువురు నేతలు కూడా తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: