ఆర్యలో ముందు బన్నీని అనుకోలేదా.. అసలు ఎవరు చేయాలో తెలుసా?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగా హీరోలు ఎంట్రీ ఇచ్చి తమ కంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఇలా మెగా మేనలుడిగా అల్లు వారి వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు అల్లు అర్జున్. గంగోత్రి అనే మూవీతో హీరోగా ప్రస్తానాన్ని మొదలుపెట్టి ఇక ఇప్పుడు పుష్ప మూవీతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. కెరియర్లో ఎన్నో ఒడిదుడుకులను చూసాడు.

 ఇతను హీరో ఏంటి బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఎవరైనా హీరో అవ్వొచ్చా అని విమర్శలను ఎదుర్కొనే స్థాయి నుంచి.. హీరో అంటే అల్లు అర్జున్ లాగే ఉండాలి అనే స్థాయికి ఎదిగాడు. ఇక ఇప్పుడు తన నటనతో సినీ ప్రేక్షకులు అందరినీ కూడా ఫిదా చేసేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇలా ఒక సాదాసీదా హీరోగా కొనసాగుతున్న అల్లు అర్జున్ నూ స్టార్ హీరోగా మార్చింది మాత్రం ఆర్య సినిమా అని చెప్పాలి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులు అందరికీ కూడా బన్నీని దగ్గర చేసింది. అయితే అల్లు అర్జున్ కెరీర్ లో తొలి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఆర్య మూవీ విడుదల ఇటీవల 20 ఏళ్ళు పూర్తయింది.

 ఈ క్రమంలోనే ఆర్య మూవీ చిత్ర బృందం ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసి ఈ మూవీ విశేషాలను కూడా పంచుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది. అల్లు అర్జున్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఆర్య సినిమాను అసలు అల్లు అర్జున్ చేయాల్సింది కాదట. ఏకంగా అల్లరి నరేష్ నూ దృష్టిలో పెట్టుకొని ఈ కథను సిద్ధం చేశారట. 100% లవ్ సమయంలో సుకుమార్ నేను కలిసాం. అల్లరిలో నా నటన నచ్చే ఆర్య కథను నాకోసం రాసానని ఆయన చెప్పారు  కానీ ఎవరికి రాసిపెట్టిన కథ వారి దగ్గరికి వెళ్తుంది. ఆర్యగా బన్నీ కంటే ఎవరూ బాగా చేయలేరు అంటూ అల్లరి నరేష్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: