గెలిస్తే గంభీర్.. ఓడిపోతే అయ్యరా.. ఇదెక్కడి న్యాయం?

praveen
2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ ప్రస్తుతం ఎంతో రసవత్తరంగా సాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచుతుంది. అయితే ఐపీఎల్ పోరు ప్రస్తుతం ప్లే ఆఫ్ దశకు చేరుకుంది.  దీంతో ఇక అన్ని టీమ్స్ కూడా మరింత అలెర్ట్ అయ్యాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టాప్ 4 లో నిలిచి ప్లే ఆఫ్ లో అడుగు పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాయ్. ఇక ప్రతి మ్యాచ్ లో కూడా గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నాయి అని చెప్పాలి.

 అయితే 2024 ఐపీఎల్ సీజన్లో కొన్ని టీమ్స్ విషయంలో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొంటుంది. సాధారణంగా క్రికెట్లో గెలుపు ఓటములు అనేవి సహజం. అయితే ఇలా గెలుపు వచ్చిన లేదంటే ఓటమి వచ్చిన జట్టులో ఉన్న ఆటగాళ్ల అందరిపై కాకుండా జట్టు కెప్టెన్ పైనే ప్రశంసలు కురుస్తూ ఉంటాయి. ఆటగాళ్లందరూ బాగా రానించి కెప్టెన్ విఫలమైన కూడా అతన్నే పొగుడుతూ ఉంటారు అందరూ. కానీ ఈ ఐపీఎల్ సీజన్లో కొన్ని టీమ్స్ విషయాల్లో మాత్రం విచిత్రమైన పరిస్థితులను నెలకొన్నాయి. జట్టు ఓడిపోతే ఒకరిని గెలిస్తే మరొకరిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ ఉన్నారు నేటిజన్స్.

 చెన్నై సూపర్ కింగ్స్ విషయంలో ఇదే జరిగింది. గెలిస్తేనేమో ధోని సలహాలతోనే గెలిచారు అని.. ఇక ఓడితేనేమో ఋతురాజు కెప్టెన్సీ వైఫల్యమే కారణమంటూ కొంతమంది విమర్శలు చేస్తున్నారు. అయితే కోల్కతా జట్టు విషయంలో ఇదే జరుగుతుంది.జట్టు ఓడిపోతే కెప్టెన్ శ్రేయస్ పై విమర్శలు చేస్తున్నారు. కానీ అదే జట్టు గెలిస్తే ఇక ఆ జట్టు మెంటర్ గా వ్యవహరిస్తున్న మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్  కు క్రెడిట్ దక్కుతుంది  ఇదే విషయంపై వెస్టిండీస్ క్రికెటర్ ఇయాన్ బిషప్ మండిపడ్డారు. గెలిస్తే క్రెడిట్ గంభీర్ కు ఇచ్చి.. పరాజయాలకు శ్రేయస్ నూ బాధ్యుడిని చేస్తారా. కోల్కతా జట్టు విఫలమైనప్పుడు గంభీర్ నూ తప్పు పట్టగలరా అంటూ విమర్శలు చేశాడు ఇయాన్ బిషప్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: