మెగా ఫాన్స్ కి బుచ్చిబాబు షాక్ ఇవ్వబోతున్నాడా.. చరణ్ సినిమాలో అది ఉండదట?

praveen
సాధారణంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారు ఏదైనా కమర్షియల్ సినిమాలో నటిస్తున్నారు అంటే చాలు.. ఇక ఆ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాల పెరిగిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఏకంగా తమ అభిమాన హీరో పాత్ర ఎంతో బలంగా ఉంటుందని.. అదే సమయంలో ఇక తమ హీరోని ఢీకొట్టే విలన్ పాత్ర కూడా అదే రేంజ్ లో ఉంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు. ఇక ఇలా హీరో విలన్ మధ్య ఉండే యాక్షన్ సీక్వెన్స్ అయితే ప్రేక్షకులను అబ్బురపరిచేలా ఉండాలని ఆశిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 కానీ ఇలా కమర్షియల్ హంగులతో తెరకెక్కుతున్న ఒక సినిమాలో ఏకంగా విలన్ లేడు అంటే ఎవరైనా జీవించుకోగలరా.. ఇక ఆయా స్టార్ హీరోల అభిమానులైతే షాక్ లో మునిగిపోతూ ఉంటారు. కాగా ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో ఇలాంటిదే జరగబోతుందట. త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత గేమ్ చేంజర్  అనే సినిమాలో నటించాడు రామ్ చరణ్. ఇక ఈ మూవీ షూటింగ్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుని బుచ్చిబాబు సనాతో మరో మూవీని మొదలెట్టాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్క బోతుంది అని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే సుకుమార్ శిష్యుడుగా పేరు సంపాదించుకున్న బుచ్చిబాబు ఇప్పటికే ఉప్పెన సినిమాతో తనలో ఉన్న క్రియేటివిటీని బయటపెట్టాడు.

 ఇక ఇప్పుడు చరణ్ సినిమాకి కూడా ఇలాగే క్రియేటివిటీకి పని చెప్పాడట. దీంతో ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయబోతుందట. ఇక ఈ మూవీలో చరణ్ ను ఢీకొట్టే విలన్ పాత్ర అంటూ ఏదీ ఉండదట. అయితే ఇక హీరో గోలే హీరోకి విలన్ గా మారే ఒక క్రేజీ కాన్సెప్ట్ తో ఈ మూవీ కథ సాగుతుందట. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఒక పాత్రలో కనిపించబోతున్నాడట. దీంతో ఆయన విలన్ పాత్రలో నటిస్తున్నాడేమో అని అందరూ అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదట. దీంతో మెగా ఫాన్స్ షాక్ అవుతున్నారు.. చరణ్ లాంటి కమర్షియల్ హీరో సినిమాలో విలన్ లేకుండా కథను డైరెక్టర్ ఎలా ముందుకు తీసుకు వెళ్ళగలరు. బుచ్చిబాబు పెద్ద రిస్కే చేస్తున్నాడు అంటూ కాస్త భయపడిపోతున్నారు మెగా ఫాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: