శంకర్ సినిమాను వదులుకొని.. చివరికి పెట్రోల్ బంక్ లో పనిచేసే స్థాయికి వెళ్లిన స్టార్ హీరో?

praveen
తమిళ ఇండస్ట్రీలో రాజమౌళి రేంజ్ లో గుర్తింపు సంపాదించుకున్నాడు శంకర్. తన సినిమాలతో ఎప్పుడు సెన్సేషనల్ హిట్లు కొడుతూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. అందుకే శంకర్ ఏదైనా సినిమా తీస్తున్నాడు అంటే చాలు ఆ మూవీలో అవకాశం కోసం ఎంతోమంది హీరోలు ఎదురుచూస్తూ ఉంటారు. కనీసం సైడ్ క్యారెక్టర్ వచ్చినా కూడా చేసేందుకు సిద్ధమవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే తన సినిమాలతో ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సృష్టించిన శంకర్ ఇక ఇప్పుడు రామ్ చరణ్తో గేమ్ చేంజర్ అనే మరో హై వోల్టేజ్ సినిమా తీస్తున్నాడు. ఇక ఈ మూవీ పై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి.

 ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది అని చెప్పాలి. శంకర్ ఇప్పుడు మాత్రమే కాదు దాదాపు రెండు దశాబ్దాల నుంచి కూడా ఇలా ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ని కోరుతూ వచ్చాడు. అలాంటి శంకర్ సినిమాలో ఛాన్స్ వస్తే ఏ హీరో అయినా వదులుకోవడానికి అస్సలు ఇష్టపడడు. కానీ ఇక్కడ ఒక హీరో మాత్రం ఏకంగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో నటించే ఛాన్స్ వస్తే వదులుకున్నాడట. ఇలా వదులుకోవడమే ఏకంగా స్టార్ హీరోని పెట్రోల్ బంకులో పనిచేసే స్థాయికి పరిస్థితులు తీసుకువచ్చాయట. ఆ హీరో ఎవరో కాదు అబ్బాస్. అప్పట్లో శంకర్ దర్శకత్వంలో ప్రశాంత్, ఐశ్వర్యరాయ్ హీరో హీరోయిన్గా వచ్చిన జీన్స్ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 అయితే ముందుగా డైరెక్టర్ శంకర్ ఈ మూవీలో హీరోగా అబ్బాస్ ను తీసుకోవాలని అనుకున్నాడట. అప్పట్లో అబ్బాస్ లవర్ బాయ్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే స్క్రిప్ట్ వినిపించగా స్టోరీ బాగుందని చెప్పాడట. కానీ అప్పటికే కొన్ని సినిమాలు కమిటవ్వడం వల్ల చివరికి శంకర్ తో సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేనని చెప్పాడట అబ్బాస్. దీంతో జీన్స్ సినిమాను వదులుకున్నాడట.  ఆ తర్వాత శంకర్ ప్రశాంత్ ను హీరోగా పెట్టి తీసి ఈ సినిమాతో హిట్టు కొట్టాడు. అబ్బాస్ మాత్రం ఈ సినిమాను వదులుకొని తప్పు చేశాడు. చివరికి ఇండస్ట్రీలో అవకాశాలు లేక ఫెడవుట్ అయ్యాడు. తర్వాత ఏకంగా పెట్రోల్ బంకులో కూడా పనిచేశాడు. దీంతో ఇప్పటికీ శంకర్ సినిమాలో వదులుకున్నందుకు అబ్బాస్ బాధపడుతూ ఉంటాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: