ఆ సినిమా సీక్వెల్ కి రెడీ అవుతున్న అల్లరి నరేష్.!

Anilkumar
అల్లరి నరేష్ కెరీర్ లో 'సుడిగాడు' సినిమా ఎంతో స్పెషల్. ఎందుకంటే అల్లరి నరేష్ ఈ సినిమాతో ఆడియన్స్ కి ఒక టికెట్ పై వంద సినిమాలు చూపించాడు. అంటే సినిమాలో రకరకాల స్పూఫ్ లు చేసి ప్రేక్షకులకు ఆ ఫీలింగ్ కలిగేలా చేశాడు. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో మంచి సక్సెస్ అందుకుంది. సినిమా అంతా గందరగోళంగా ఒక్కో సీన్ కి ఒక్కో సీన్ సంబంధం లేకుండా లాజిక్స్ అన్ని పక్కనపెట్టి ఆడియన్స్ అందరూ కడుపుబ్బా నవ్వుకునేలా ఈ సినిమాని తెరకెక్కించారు. దాంతో ఆడియన్స్ నుంచి అప్పట్లో సుడిగాడు

సినిమాకి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. సుడిగాడు సీక్వెల్ కి సంబంధించి అల్లరి నరేష్ దగ్గరికి తాజాగా ఓ స్క్రిప్ట్ వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ పార్ట్ తరహాలోనే.. లేటెస్ట్ సినిమాల స్పూఫ్ తో.. ఈమూవీని తెరకెక్కించాలి అని అనుకుంటున్నారట. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలోనూ జనాల్ని నవ్వించే స్టఫ్ కో కొల్లలుగా ఉండటంతో ఈసారి ఆడియన్స్ ను ఇంకా గట్టిగా ఎంటర్టైన్ చేయాలని చూస్తున్నారట. అయితే ఈ ప్రాజెక్టును ఎవరు డైరెక్ట్ చేస్తారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

 ఫస్ట్ పార్ట్ తీసిన భీమనేని శ్రీనివాసరావు ఈ ప్రాజెక్టు డైరెక్ట్ చేస్తారా? లేక కొత్త వాళ్ళు ఎవరైనా హ్యాండిల్ చేస్తారా? అనేది చూడాలి. నిజానికి ఈమూవీకి సీక్వెల్ చేయాలని రిలీజ్ అప్పుడే అనుకున్నారట. దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు కథ రాస్తున్నారని కూడా అన్నారు. అయితే ఆ తర్వాత దర్శకుడిగా ఆయన హవా తగ్గడం, నరేశ్‌ సీరియస్‌ సినిమాలవైపు మొగ్గు చూపడంతో ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. కొన్ని నెలల క్రితం ఇదే సుడిగాడు సీక్వెల్ ని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నారనే న్యూస్ కూడా వచ్చింది. కానీ అదీ జరగలేదు. ఇప్పుడు మరోసారి సుడిగాడు సీక్వెల్ గురించి ఆసక్తికర విషయాలు ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: