'రాజా సాబ్' మూవీని.. మారుతి ముందుగా ఆ హీరోతో చేయాలనుకున్నాడా?

praveen
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ అనే మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఈ క్రమంలోనే మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తూ ఉన్నాడు అన్న తెలిసిందే. అయితే ఈ సినిమాకు ముందుగా రాజా డీలక్స్ అనే టైటిల్ అనుకున్నప్పటికీ ఇక ఇటీవల ఆ టైటిల్ ను రాజా సాబ్ అంటూ మార్చి ఒక పోస్టర్ని విడుదల చేశారు చిత్ర బృందం.

 చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ మళ్ళీ ఒక కామెడీ థ్రిల్లర్ ఓడియంటెడ్ సినిమా చేయబోతున్నాడు అని చెప్పాలి. ఇక ఈ మూవీపై అభిమానుల్లో కూడా ఎంతగానో ఆసక్తి ఉంది  ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులందరికీ కూడా ఎంతగానో ఆకట్టుకుంది అనడంలో సందేహం లేదు. మునిపెన్నడూ చూడని విధంగా ప్రభాస్ ఏకంగా లుంగీ కట్టుకొని ఎంతో డిఫరెంట్ గా కనిపిస్తూ ఉన్నాడు. అయితే ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారు అన్నది తెలుస్తోంది. కాగా ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రస్తుతం శరవేగంగా జరుగుతూ ఉంది అని చెప్పాలి.

 అయితే ఈ మూవీ ని ముందుగా డైరెక్టర్ మారుతి ప్రభాస్ ప్రభుత్వ తీయాలని అనుకోలేదట. సినిమా స్టోరీ కంప్లీట్ చేసిన తర్వాత నాచురల్ స్టార్ నానికి సినిమా కథను వినిపించాడట. అయితే కొన్ని కారణాలవల్ల ఇక నాని ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు అన్నది తెలుస్తోంది. దీంతో ఈ కథతో  ఎంతో మంది హీరోల వద్దకు వెళ్లాడట. ఇక ఏ హీరో ఒప్పుకోకపోవడంతో సినిమా కథలో పెద్ద ఎత్తున మార్పులు చేశాడట మారుతి. ఇక తర్వాత ప్రభాస్ వద్దకు వెళ్ళగా ప్రభాస్ వెంటనే సినిమాకు ఓకే చెప్పేసాడట. ఇలా ఏకంగా నాచురల్ స్టార్ నాని చేయాల్సిన రాజా సాబ్ మూవీని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: