వామ్మో.. 'దేవర' కోసం కొరటాల శివ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలుసా?

praveen
త్రిబుల్ ఆర్ సినిమా ముందు వరకు కూడా కేవలం టాలీవుడ్ లో మాత్రమే స్టార్ హీరోగా కొనసాగిన జూనియర్ ఎన్టీఆర్ ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఏకంగా గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఎన్టీఆర్ మూవీ వస్తుందంటే చాలు కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అంతలా తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో గుర్తింపును సంపాదించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు.

 పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో అటు హీరోగా నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఇక డైరెక్టర్ కొరటాల శివ రెమ్యూనరేషన్ ఎంత అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇక గ్లోబల్ స్టార్ గా మారిపోయిన తర్వాత ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా కోసం 100 కోట్ల వరకు పారితోషకం అందుకుంటున్నాడు అన్న వార్త ఇండస్ట్రీలో గత కొంతకాలం నుంచి చక్కర్లు కొడుతుంది.

 అయితే డైరెక్టర్ కొరటాల శివ ఎంత పారితోషకం తీసుకున్నాడు అనేది తెలుసుకోవడానికి కూడా అటు అభిమానులు అందరూ కూడా ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. కాగా సాధారణంగా ఒక్కో సినిమాకి 20 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటాడట కొరటాల శివ  కానీ పాన్ ఇండియా రేంజ్ లో తెరకేక్కుతున్న దేవర మూవీ కోసం 40 కోట్ల వరకు పారితోషకం అందుకుంటున్నాడు అన్నది తెలుస్తుంది. ఇక ఈ విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ఆచార్యతో డిజాస్టర్ చవి చూసిన కొరటాల శివకు ప్రొడ్యూసర్లు అంత పెద్ద మొత్తంలో పారితోషకం ఇచ్చారా అని షాక్ లో మునిగిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: