ఏపీ: జగన్ కొత్త సభలు సక్సెస్.. వైసీపీ మేనిఫెస్టో ఫలించిందా..?

Pandrala Sravanthi
ఎన్నికలు వచ్చాయంటే చాలు పార్టీలు, పార్టీ అభ్యర్థులు వారు పోటీ చేసే చోట్లలో హడావిడి చేస్తూ ప్రజలను ఎలా ప్రసన్నం చేసుకోవాలో  ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఈసారి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా ఉన్నాయి.ఎందుకంటే జగన్ ఒంటరిగా పోటీ చేస్తే చంద్రబాబు బిజెపి, జనసేన ను కలుపుకొని పోటీ చేస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలుస్తారు అనేది చెప్పడం కష్టంగా మారింది. అయితే ఇప్పటికే అటు కూటమి,ఇటు వైసిపి పార్టీ అభ్యర్థులు ప్రచారాలు చేస్తూ బిజీబిజీగా తిరుగుతున్నారు. అలాగే ఒక పార్టీ నుండి మరో పార్టీకి జంపింగ్ లు కూడా భారీ గానే జరుగుతున్నాయి.ఇలాంటి వేళ నిన్న అనగా మార్చి 27న జగన్ తన మేనిఫెస్టోని విడుదల చేశారు.

ఇక ఈ మేనిఫెస్టోలో అంతకుముందు ఉన్న పథకాలనే కాస్త పెంచి బడ్జెట్ ప్రకారం ఏ పథకానికి ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసి ఇచ్చేదే చెబుతాం కానీ బాబు లాగా అబద్ధపు హామీలు ఇవ్వమని జగన్ తెలియజేశారు. అయితే తాజాగా జగన్ మేనిఫెస్టో ఫలించింది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే తాజాగా జగన్ సిద్ధం బహిరంగ సభలకి భారీగా జనాలు తరలివచ్చారట. అయితే రాజకీయ నాయకులు బహిరంగ సభ పెడుతున్నారంటే చాలామంది జనాలు డబ్బుకి,మందుకి, బిర్యాని ప్యాకెట్లకు ఆశపడి వస్తూ ఉంటారు. ఇక ఏపీలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది.

ప్రతి ఒక్కరు ఏ పార్టీ నాయకుడు బహిరంగ సభ పెట్టినా కూడా డబ్బులకు లేదా మరేదానికైనా ఆశపడి వెళ్తూ ఉంటారు. కానీ ఎవరికీ ఓట్లు వేస్తారు అనేది మాత్రం తెలియదు.ఏ నాయకుడు పిలిచినా కూడా వెళ్తాడు. అయితే తాజాగా జగన్ సిద్ధం సభలకు ఈరోజు భారీగా జనం తరలి రావడంతో ప్రజల్లో జగన్ పై అభిమానం పెరిగిందని, వైసిపి విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజలకు నమ్మకం కలిగించిందని అంటున్నారు. అంతేకాదు ఈరోజు జగన్ మూడు బహిరంగ సభలు నిర్వహిస్తే ఆ మూడు బహిరంగ సభలకి కూడా భారీగా జనం తరలి రావడంతో వైసిపి శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.అయితే ఈ వచ్చిన వాళ్ళందరూ ఓట్లు వేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: