అవి నా జీవితంలో చీకటి రోజులు... ప్రియాంక చోప్రా..!

Pulgam Srinivas
ఇండియాలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా ఇతర పాత్రలో నటించి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. అలాగే ఇండియాలో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈమె హాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది.

ఇక హాలీవుడ్ లో కూడా ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె హాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రారంభంలో ఆమె ఎదుర్కొన్న కష్టాలు గురించి , ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే వాటి గురించి క్లియర్ గా చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూ లో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ ... హాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి దశలో చీకటి రోజులను అనుభవించాను.

హాలీవుడ్ ఇండస్ట్రీ కి వెళ్లిన కొత్తలో చాలా భయం వేసింది. నాకు అక్కడ తెలిసిన వారు ఎవరూ లేకపోవడంతో చాలా ఒంటరిగా ఫీల్ అయ్యాను. అది ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. ఇండియాలో నేను స్టార్ హీరోయిన్ అయినా కూడా హాలీవుడ్ లో కెరియర్ను మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయవలసి వచ్చింది. అలాంటి సమయం లోనే నా పనిని నేను చేసుకుంటూ వెళ్లాను చివరగా హాలీవుడ్ లో కూడా సక్సెస్ అయ్యాను అని చెప్పుకొచ్చింది. ఇకపోతే హాలీవుడ్ లో సక్సెస్ అయిన ఈ బ్యూటీ కి ప్రస్తుతం ఇండియన్స్ సినీ పరిశ్రమలో కూడా మంచి క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

pc

సంబంధిత వార్తలు: