పవన్ 'బ్రో' సినిమాని ఎంతమంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేసారో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన మల్టీస్టారర్ మూవీ బ్రో. తమిళంలో ఘనవిజయం అందుకున్న వినోదయ సీతం సినిమాకి రీమేగా ఈ సినిమా వచ్చింది. సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. ఆమెతోపాటు రోహిణి ప్రియా ప్రకాష్ వారియర్ వెన్నెల కిషోర్ తనికెళ్ల భరణి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించారు. భారీ అంచనాల నడుమ జులై 28న ఈ సినిమా గ్రాండ్గా విడుదలై మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతోంది. పవన్ క్రేజ్  వల్ల తొలి రోజు ఈ సినిమాకి అదిరిపోయే ఓపెనింగ్ వచ్చాయి. 

వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకి 30 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ ను సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇక బ్రో సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే బ్రో సినిమాకు పవన్ కళ్యాణ్ మరియు సాయిధరమ్ తేజ్ ఫస్ట్ ఛాయిస్ కాదన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా షికార్లు చేస్తున్నాయి. ఇక తాజాగా అందుతుంద సమాచారం మేరకు తమిళంలో వినోదయ సీతం సినిమా మంచి విజయాన్ని అందుకున్న తరువాత సముద్రఖని ఈ సినిమాని తెలుగులో తీయాలని అనుకున్నారు.

అది కూడా ప్రభాస్ మరియు అఖిల్ తో ఈ సినిమా చేయాలని ఆయన అనుకున్నారట. కానీ ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉండడం వల్ల సముద్రఖని ఆయనను కలవలేకపోయారు. దాని తర్వాత సూర్యా మరియు కార్తిలను ఈ సినిమా కోసం అనుకున్నారట. కానీ ఆ ఇద్దరు హీరోలు కూడా ఈ సినిమా చేయడానికి ఆసక్తి చూపలేదు. ఫైనల్గా త్రివిక్రమ్ రంగంలోకి దిగిన తర్వాత పవన్ కళ్యాణ్ మరియు సాయిధరమ్ తేజ్లను సముద్రఖని సూచించారు. అలా వీరిద్దరితో బ్రో సినిమా చేయడం జరిగింది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ మొదటి సినిమా మంచి టాక్ తో దూసుకుపోతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: