బ్రో సినిమా నైజం హక్కులకు కళ్ళు చెదిరే మొత్తం.. ఎంతో తెలుసా..!?

Anilkumar
ఇద్దరు మెగా హీరోలు కలిసి నటించిన తాజా సినిమా బ్రో. తమిళ యాక్టర్ మరియు డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా 28న విడుదల కావడానికి రెడీగా ఉంది. తమిళంలో ఆయన తీసిన వినోదయ సీతం సినిమాని తెలుగులో బ్రోగా తెరకెక్కిస్తున్నాడు సముద్రఖని. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు బ్రో సినిమా నైజాం హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యా అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బ్రో సినిమా హక్కులను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్ సంస్థ ఏకంగా 36 కోట్లకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. 

అయితే పవన్ కళ్యాణ్ మరియు సాయి తేజ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నయి. అంతేకాదు విడుదలకు ముందు ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూద్దామా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినీ లవర్స్. అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ మరియు పోస్టర్లు భారీ క్రేజ్ నీ అందుకున్నాయి.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో ప్రియా ప్రకాష్

వారియర్ మరియు కేతిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సాహితీజ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించడంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి అని చెప్పాలి. అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలను విడుదల చేశారు. అయితే ఈ సినిమా నుండి విడుదలైన శ్లోకం మరియు మొన్న విడుదలైన డాన్స్ బ్రో పాట సైతం ప్రేక్షకుల నుండి మంచి ఆదరణను పొందాయి .దీంతో ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా నీ వెయిట్ చేస్తున్నారు సినీ లవర్స్ ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: