మెగా కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిందే కదా. ఉపాసన ప్రెగ్నెంట్ అవ్వడంతో ఈమెకు సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా అది సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంది. పెళ్లయిన పది సంవత్సరాలకి రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతుండడంతో పుట్టబోయే బిడ్డకు సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియా అంతట వైరల్ గా మారుతుంది. ప్రస్తుతం ఉపాసనకి ఏడో నెల కావడంతో మరో రెండు నెలల్లోనే ఈమె బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ క్రమంలోనే తనకు పుట్టబోయే బిడ్డ గురించి అలాగే తన డెలివరీ గురించి ఉపాసన ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఉపాసనకు సంబంధించి సీమంతపు వేడుకను జరిపారు. ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఉపాసన తనకు పుట్టబోయే బిడ్డ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసింది. తనకు జూలై నెలలో డెలివరీ డేట్ ఇచ్చారని.. అప్పుడే తాను బిడ్డకు జన్మనివ్వబోతున్నారని తెలిపింది ఉపాసన. ప్రతి ఒక్కరూ తమ బిడ్డ కోసం ఎదురు చూస్తుంటారు. అలాగే తాము కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నామని తెలిపింది. ఇక రామ్ చరణ్ కూడా పుట్టబోయే బిడ్డ కోసం షూటింగ్స్ కూడా బ్రేక్ ఇచ్చాడు. ఇక ప్రెగ్నెన్సీ సమయంలో ప్రతిక్షణం రామ్ చరణ్ తనకు ఎంతో సపోర్టుగా నిలిచారని ఉపాసన చెప్పుకొచ్చింది.
అలా పుట్టబోయే బిడ్డ కోసం ప్రతి విషయంలోనూ తాను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఒకవైపు బిడ్డ ఆలనా పాలనా చూసుకుంటూ మరోవైపు వృతి పరమైన జీవితంలో ముందుకు కొనసాగేలా నిర్ణయం తీసుకున్నానంటూ ఈ సందర్భంగా ఉపాసన తనకు పుట్టబోయే బిడ్డ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఉపాసన డెలివరీ డేట్ జూలై నెల అని చెప్పడంతో మెగా ఫాన్స్ అయితే ఈ వార్త తెలిసి తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.ఇక ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్తో గేమ్ చేంజర్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నారు మేకర్స్...!!