మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తన భర్తతో శ్రీజ విడాకులు తీసుకుని ఇప్పుడు మూడో పెళ్లికి రెడీ అవుతుందని ఆమె గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి శ్రీజ పెట్టిన పోస్ట్ వల్ల ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది. ఇక శ్రీజ సోషల్ మీడియాలో ఎంత ఆక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్టులు క్షణాల్లో వైరల్ గా మారుతుంటాయి. తాజాగా శ్రీజ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఇక పోస్టుకి అర్థం ఏమిటని ప్రేక్షకులతో పాటు మెగా అభిమానులను ఒక ఆసక్తికర చర్చ జరుగుతోం.ది ఇక ఆ వివరాలకు వెళ్తే.. తాజాగా శ్రీజ తన ఇంస్టాగ్రామ్ వేదికగా.. 'సంతోషంగా కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నానంటూ 2023 కి వెల్కమ్ చెబుతూ పోస్ట్ పెట్టింది.
అయితే కేవలం కొత్త ఏడాదికి మాత్రమే కాదు కొత్త వ్యక్తిని కలవడంతో పాటు కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నట్టు ఆమె పెట్టిన పోస్ట్ చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ లో తన జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తిని గత ఏడాది కలశానని పేర్కొంది." ప్రియమైన 2022 నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తిని కలిసేలా చేసినందుకు థాంక్స్. నా గురించి తనకి చాలా బాగా తెలుసు. ఎటువంటి హద్దులు లేకుండా ప్రేమ చూపించడంతోపాటు నా కష్టసుఖాలు ఎప్పుడు నాకు తోడుగా ఉండే వ్యక్తి డియర్ మీ.. ఫైనల్ గా నిన్ను కలవడం ఎంతో అద్భుతంగా ఉంది. కొత్త ప్రయాణం మొదలవుతుంది" అని శ్రీజ ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ ని షేర్ చేసింది.
అయితే శ్రీజ పెట్టిన పోస్ట్ కు అసలు అర్థం ఏమిటని ఇప్పుడు నెటిజెన్స్ చర్చలు జరుపు తున్నారు. కొంపతీసి శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతుందా? అందుకే ఇలా పరోక్షంగా పోస్ట్ పెట్టిందా?? అయితే మూడో పెళ్లి చేసుకోబోయే అతను ఎవరు? అంటూ నేటిజన్స్ రకరకాలుగా ఈ పోస్ట్ కింద కామెంట్ చేస్తున్నారు. కానీ అలాంటిది ఏమీ లేదని మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు. ఎందుకంటే శ్రీజ పెట్టిన పోస్ట్ కు అర్థమేంటంటే.. తనను తాను కలిశాను. అంతే తప్ప ఎవరో కొత్త వ్యక్తిని కాదు. తనకు తాను మాత్రమే తోడుగా ఉంటూ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆమె పోస్ట్ చేసిందని మరి కొంతమంది చెబుతున్నారు. కానీ చాలామంది నెటిజెన్స్ మాత్రం శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతుందని.. ఆమె పెట్టిన పోస్ట్ కి రకరకాల అర్థాలు తీస్తున్నారు. ఏదేమైనా శ్రీజ పెట్టిన పోస్ట్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..!!