టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈయన తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న బడా నిర్మాతలలో ఒకరిగా రాణిస్తున్న విషయం తెలిసిందే.అయితే మొదట నితిన్ నటించిన దిల్ సినిమాతో నిర్మాతగా సినీ ఇండస్ట్రీకి ఇచ్చిన దిల్ రాజు మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకోవడంతో ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా స్థిరపడిపోయారు.ఇక దిల్ సినిమా తర్వాత తెలుగులో ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు దిల్ రాజు. ఆయన నిర్మాతగా వ్యవహరించిన ఎన్నో సినిమాలు వరుసగా విజయాలు అందుకున్నాయి.
ప్రస్తుతం నిర్మాత దిల్ రాజు, శంకర్,రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సందర్భంగా యాంకర్ ప్రశ్నిస్తూ.. బాలీవుడ్ హీరోల రెమ్యూనరేషన్ ని మించి టాలీవుడ్ హీరోల రెమ్యూనరేషన్ పెరిగిపోతుంది.కాగా ఇందుకు బాహుబలి సినిమా కారణమా? అని ప్రశ్నిస్తుండగా ఆ విషయం పై స్పందించిన దిల్ రాజు.. ఏ ఇండస్ట్రీ అయినా రెమినరేషన్ తీసుకునే వాళ్ళది తప్పు కాదు.
ఇకపోతే వాళ్లకు అంత రెమ్యూనరేషన్ ఇచ్చే నిర్మాతలది తప్పు. అయితే ఇది డిమాండ్ అండ్ సప్లయిని బట్టి ఉంటుంది.ఇక ఆ సినిమాకు వారు అవసరం అనుకున్నప్పుడు తప్పదు.అంతేకాదు నేను 20 ఏళ్లుగా సిని రంగంలో ఉన్నాను కాబట్టే నేను కాలిక్యులేటెడ్గా పని చేస్తాను. హీరో వంద అడిగితే, మిగతా టెక్నీషియన్లకు ఎంతవుతుంది? మేకింగ్కి ఎంత సమయం పడుతుంది. అయితే ఒకవేళ సినిమా ఆరు నెలల్లో పూర్తయితే ఇంట్రస్ట్లు మిగులుతాయి. ఏడాది అయితే పెరుగుతాయి.ఇక లాభాలతో పని లేకుండా డ్యామేజీ జరగకుండా కాలిక్యులేటెడ్గా ఉండడం ప్రొడ్యూసర్ పని అని తెలిపారు నిర్మాత దిల్ రాజు.అంతేకాదు అలాగే డిస్ట్రిబ్యూటర్ ను కాపాడుకోవలసిన బాధ్యత కూడా ప్రొడ్యూసర్దే అని ఆయన తెలిపారు. ఇక అలా కాకుండా అబ్నార్మల్ ప్రైజులకు అమ్మేస్తే, సినిమా ఫ్లాప్ అయినప్పుడు వారంతా నిర్మాతల మీద పడిపోతారు అని దిల్ రాజు చెప్పుకొచ్చారు..!!