దబాంగ్ బ్యూటీ తో రొమాన్స్ చేయనున్న బాలయ్య..!?

Anilkumar
సాధారణంగా ఒక సీనియర్ హీరోని యంగ్ హీరోయిన్‌తో డ్యూయట్స్ పాడమని ప్రోత్సహించరు.అయితే  చాలా మంది సీనియర్ హీరోలు హీరోయిన్ల విషయంలో తప్పటడుగులు వేస్తున్నారు.ఇక  మెగాస్టార్‌ కాజల్‌ అగర్వాల్‌తో, వెంకటేష్‌ తమన్నాతో కలిసి నటించడం మనం చూశాం. కాగా నాగార్జున ఎప్పటిలాగే ‘బంగార్రాజు’లో రమ్య కృష్ణన్‌తో రొమాన్స్ చేశాడు.అయితే  ‘ది ఘోస్ట్’లో సోనాల్ చౌహాన్‌తో ఒక రొమాంటిక్ పాట కూడా ఉంది.... చిరంజీవి ‘గాడ్‌ఫాదర్‌’లో కథానాయిక లేరు, ఈ మధ్య కాలంలో రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌లు ఆ తరహా పాత్రలు పోషిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.

ఇకపోతే ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాల్లో శృతి హాసన్‌ కథానాయిక. ఇక కొన్నాళ్ల క్రితం వరకు యంగ్ హీరోయిన్లతో తెరపై రొమాన్స్ చేసే నందమూరి బాలకృష్ణ కూడా పరిణితి చెందిన పాత్రలను ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ‘వీరసింహారెడ్డి’ తర్వాత కమర్షియల్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడితో జోడీ కట్టబోతున్న సంగతి తెలిసిందే.కాగా  యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని అంచనా వేస్తున్నారు.ఇక  ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి హీరోయిన్‌ని ఖరారు చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.ఇకపోతే  ఈ పాత్ర కోసం ‘దబాంగ్’ బ్యూటీ సోనాక్షి సిన్హాను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఇక బాలీవుడ్‌లో బబ్లీ హీరోయిన్ కెరీర్ అనుకున్నంతగా సాగకపోవడంతో కెరీర్‌లో కొన్ని హిట్లు ఉన్నప్పటికీ స్టార్ హీరోయిన్ హోదాను అందుకోలేకపోయింది.అయితే  ఆమె లుక్స్, నటనపై కూడా ట్రోల్స్ వచ్చాయి. ఇక దీంతో ఆమె డేట్స్ చాలా ఈజీగా దొరుకుతాయని, బాలయ్యకు హీరోయిన్‌గా ఆమె సూట్ అవుతుందని అనిల్ రావిపూడి భావిస్తున్నట్లు సమాచారం.అయితే  ముందుగా రకుల్ ప్రీత్ సింగ్‌ని రంగంలోకి దించాలని అనుకున్నారు కానీ అది కుదరలేదు. అంతేకాదు వేరే హీరోయిన్ ఎంపిక లేకపోతే సోనాక్షిని ఖరారు చేస్తారు. ఇక ఈ చిత్రంలో ప్రియమణి కీలక పాత్రలో నటిస్తుండగా, యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురిగా కనిపించనుందని వార్తలు వచ్చాయి. అయితే అధికారిక సమాచారం వచ్చే వరకు వేచి చూడాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: