తాజాగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఇటీవల త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ కెరీర్‌లో 30వ సినిమాగా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ వస్తోంది.అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ 31వ సినిమా కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఉంటోంది.ఇక ఇది కూడా పాన్ ఇండియా ప్రాజెక్టే. అయితే ఎన్టీఆర్ 30వ ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఆచార్య లాంటి ప్లాప్ తర్వాత కొరటాల డైరెక్ట్ చేస్తోన్న సినిమా కావడంతో కొరటాల ఎలాగైనా ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్ కొట్టి ఫామ్‌లోకి రావడంతో పాటు తానేంటో ఫ్రూవ్ చేసుకోవాలన్న కసితో ఉన్నాడు.
అంతేకాదు ఎన్టీఆర్ 30వ ప్రాజెక్టు నుంచి ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా వచ్చిన మోషన్ పోస్టర్ గ్లింప్స్ అయితే పాన్ ఇండియా లెవల్లో ఉన్నాయి. ఇక ఈ సినిమా కాస్టింగ్ విషయంలో కొరటాల ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇకపోతే కొరటాల తనయుడు మిక్కలినేని సుధాకర్ తన యువసుధా ఆర్ట్స్ బ్యానర్, ఇక ఇటు ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్‌రామ్ తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి అదిరిపోయే బజ్ ఉన్న న్యూస్ వచ్చేసింది. ఇకపోతే ఎన్టీఆర్ అభిమానులు సైతం మూడున్నరేళ్ల తర్వాత తమ అభిమాన హీరోను త్రిబుల్ ఆర్‌లో వెండితెరపై చూసినా అది మల్టీస్టారర్ సినిమా కావడం.
ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర అభిమానుల అంచనాలకు ఎక్కడో తగ్గినట్టుగా వారు ఫీల్ అవ్వడంతో వారు ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.తాజా సమాచారం ప్రకారం ఈ క్రమంలోనే ఎన్టీఆర్ - కొరటాల మూవీ షూటింగ్ వచ్చే నెల నుంచి స్టార్ట్ చేసి కంటిన్యూగా షూటింగ్ ఫినిష్ చేసి వచ్చే యేడాది సమ్మర్ కానుకగా మే 30న థియేటర్లలోకి తీసుకు వచ్చేలా మేకర్స్ ప్లాన్ చేసుకున్నారట. ఇక ఎంత లేదన్నా ఇంకా యేడాది పాటు ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం వెయిట్ చేయక తప్పని పరిస్థితి. కాగా ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు..!!