ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.అయితే కరోనా సంక్షోభం మరియు పాన్ ఇండియా చిత్రాల రిలీజ్ కారణంగా గత కొన్ని నెలలుగా మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' మూవీ విడుదలకు నోచుకోలేదు. ఇక ప్రస్తుతం ఇప్పుడా సినిమాకు అన్ని అడ్డంకులు తొలగడం వల్ల ఏప్రిల్ 29న చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది.ఇకపోతే ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ ను షురూ చేయాలని భావిస్తోంది. ఇక ఈ క్రమంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను నిర్వహణపై టాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య' చిత్రం ఏప్రిల్ 29న రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఏప్రిల్ 24న నిర్వహించాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. అయితే హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఈ వేడుకను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేదా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ విచ్చేసే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక అదే నిజమైతే మెగా అభిమానులకు పండగే!అయితే కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు ఓ కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించారు.
ఇకపోతే ఇందులో వీరిద్దరూ నక్సల్స్ పాత్రల్లో కనిపించనున్నారని ప్రచార చిత్రాలు చూస్తే తెలుస్తోంది. ఇక వీరితో పాటు కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే ఈ మూవీలో హీరోయిన్లుగా నటించారు. ఇకపోతే కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే దేవదాయ శాఖలో జరిగే అక్రమాల నేపథ్యంతో సాగిన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఈ మూవీకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ప్రస్తుతం గాడ్‌ఫాదర్, బోలా శంకర్ సినిమా షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉన్నారు మెగాస్టార్. ఈ సినిమాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి...!!