'పుష్ప 2' కోసం అలనాటి స్టార్ హీరోయిన్.. సుకుమార్ నయా ప్లాన్..?

Anilkumar
చాలా వరకూ ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో సీనియర్ హీరోయిన్ ల ఎంట్రీ లు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇది ఒకటి ట్రెండ్ లాగా మారిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రంలో సీనియర్ స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే.ఇకపోతే  రాధికా, ఖుష్బూ, నదియా, ఆమని లాంటి వారు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు.అయితే  వీరితో పాటు స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న సీనియర్ నటి ఇంద్రజ.. ఇకపోతే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారుతోంది. అంతేకాకుండా ఇటీవలే స్టాండప్ రాహుల్ చిత్రంలో రాజ్ తరుణ్ తల్లి పాత్రలో నటిస్తోంది..

అయితే త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇంద్రజ కు వచ్చిన ఆఫర్ గురించి సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళితే ఐకాన్ అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న పుష్ప 2 లో ఇంద్రజకు ఆఫర్ వచ్చిందని ఆ వార్త సారాంశం.అయితే  ఒక కీలక పాత్ర కోసం సుకుమార్, ఇంద్రజాను సంప్రదించారట. ఇకపోతే  ఈ వార్తతో ఇంద్రజ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. కాగా పుష్ప సినిమాలో ఉన్నవారే పుష్ప 2 లో ఉంటారట.. అంతేకాదు అయితే పుష్ప 2 లో కథను కొత్తగా మలుస్తున్నారని, అందుకు తగ్గట్టే పాత్రలను ఎంచుకుంటున్నాడట సుకుమార్.

అయితే  పాన్ ఇండియా స్టార్ తో ఆఫర్ అంటే సీనియర్ నటి ఇంద్రజకు ముందు ముందు పెద్ద స్థాయిలో అవకాశాలు వస్తాయని అభిమానులు గుసగుసలాడుతున్నారు. ఇకపోతే  ఇదే కనుక నిజమైతే ఇంద్రజ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక పుష్ప పార్ట్ 2 విషయానికొస్తే.. ఈ నెల చివర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. వీలైనంత వరకు టైంలోనే ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేయాలని డిసైడ్ అయ్యాడట. ఇక పార్ట్ 2 కూడా ఈ ఏడాది చివర్లో డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: