టాలీవుడ్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న పవర్ స్టార్ చిత్రం “భీమ్లా నాయక్” ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ షోలు ఓవర్సీస్‌లో ప్రదర్శితం అయ్యాయి.కాగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఇక ప్రస్తుతం థియేటర్లలో ‘భీమ్లా నాయక్’ సందడి నడుస్తోంది. అయితే మెగా అభిమానులు సినిమా హాళ్లలో రచ్చరచ్చ చేస్తున్న వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్నప్పటికీ..
అభిమానులు మాత్రం ఒక్క విషయంలో నిరాశకు గురైనట్టు తెలుస్తోంది. ఇక అదేంటంటే మెలోడియస్ సాంగ్ “అంత ఇష్టం ఏందయ్యా” అనే పాటను మేకర్స్ సినిమా నుండి తొలగించడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.ప్రస్తుతం ఈ లిరికల్ సాంగ్ విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే మరి ఈ హిట్ ట్రాక్‌ని మూవీలో నుంచి తీసివేయడానికి గల కారణాలు ఏంటో తెలియరాలేదు. కాగా నిత్యామీనన్ కు కూడా మొత్తానికే ఆమె పాటను సినిమాలో నుంచి కట్ చేయడం షాకిచ్చే విషయమని చెప్పొచ్చు. ఒక విధంగా ఇది ఫ్యాన్స్ కి మరియు ఆడియన్స్ కి నిరాశను కలిగించే అంశం అనే చెప్పాలి.
ఎందుకంటే విడుదలకు ముందే ఈ పాట ఆడియన్స్ లో భారీ రెస్పాన్స్ అని కనబరిచింది. అలాంటి సూపర్ హిట్ పాటని సినిమాలో తీసేయడం ఆశ్చర్యకరం.ఇక సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ మంచి ఈ సినిమాని నిర్మించారు. యువ దర్శకుడు సాగర్ కే చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్, ప్లే డైలాగ్స్ అందించగా.. తమన్ సంగీతాన్ని సమకూర్చారు. సముద్రఖని, రావు రమేష్, మురళీశర్మ, రఘుబాబు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు...!!