బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ప్రస్తుతం 19 మంది కంటెస్టెంట్స్ తో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే బిగ్ బాస్ స్టార్ట్ అయి వారం కావచ్చింది.ఇక బిగ్ బాస్ హౌజ్ లో వీకెండ్ ఎపిసోడ్ అంటే ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది.ఎందుకంటే వీకెండ్ ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున వస్తాడు. దాంతో సందడి షురూ అవుతుంది. ఇక మరోవైపు హౌజ్ మేట్స్ కి నాగ్ ఎలా క్లాస్ పీకుతాడు అనే అంశం కూడా ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచుతుంది.అయితే ఈసారి ఫస్ట్ వీక్ కదా అని హౌజ్ మేట్స్ కి కాస్త రిలీఫ్ ఇచ్చాడు నాగార్జున.కానీ వీకెండ్ ఎపిసోడ్ లో భాగంగా సెట్ అండ్ కట్ గేమ్ లో హౌజ్ మేట్స్ మాత్రం ఒకరినొకరు నామినేషన్స్ రేంజ్ లో రెచ్చిపోయారు.
హౌజ్ లో ఇప్పటివరకు మీకు ఎవరితో సెట్ అయ్యింది.. ఎవరితో కట్ అయ్యింది అనే గేమ్ ని ఆడించారు నాగార్జున.అందులో సెట్ అయిన వాళ్ళకి బ్యాండ్ పెట్టాలి.ఇక కట్ అయిన వాళ్ళ ఫోటోని చింపి డస్ట్ బిన్ లో వేయాలి.సరిగ్గా ఇక్కడే ఆర్ జే కాజల్ ని టార్గెట్ చేశారు హౌస్ మేట్స్.కాజల్ ఫోటోని చింపి పారేశారు.ఈ గేమ్ లో భాగంగా మొదట వచ్చిన విశ్వ మానస్ ని సెట్ చేసుకున్నాడు.అలాగే కాజల్ ని కట్ చేసాడు.ఇక అక్కడినుంచి కాజల్ ఫోటో చిరగడం అనేది మొదలైంది.విశ్వ తర్వాత లహరి,లోబో, శ్రీరామ్ చంద్ర, నటరాజ్, ఉమా మరియు ఆని మాస్టర్లు కాజల్ ని కట్ చేస్తూ ఆమె ఫోటోని చింపి డస్ట్ బిన్ లో వేశారు.ముఖ్యంగా ఉమా కట్ చేసిన తీరుఆమెకి కాజల్ పై ఉన్న కసిని చూపించిందనే చెప్పాలి.
ఇక ఇక్కడే కాజల్ కాస్త సహనాన్ని ప్రదర్శించి శ్రీరామ్ చంద్ర ని సెట్ చేసి.. ఉమాదేవి ని కట్ చేసింది.అయితే హౌస్ మొత్తంలో కాజల్ కి ఏడు ఓట్లు రావడం గమనార్హం.అయితే సరిగ్గా ఇక్కడే నెక్స్ట్ వీక్ నామినేషన్స్ ని తలపించేలా హౌస్ మీట్స్ కాజల్ పై ఉన్న కసిని చూపించారు.అన్నింటిలోనూ తన ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువగా ఉంటుందని,బాగా హైపర్ అయిపోతుందని హౌస్ మేట్స్ రీజన్ చెప్పడంతో కాజల్ స్పీడ్ కు ఈ వీక్ బ్రేక్ పడిందనే చెప్పాలి.మరి నెక్స్ట్ వీక్ నామినేషన్స్ లో కాజల్ ఉంటుందా?ఒక వేళ ఉంటే కాజల్ ని ఎంతమంది నామినేట్ చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక మరోవైపు ఈ వీకెండ్ ఎపిసోడ్ లో ఎవరు హౌస్ నుండి ఎలిమినెట్ అయి బయటికి వెళ్లబోతున్నారు అనేది ఈ రోజు ప్రసారమయ్యే ఎపిసోడ్ లో తేలనుంది...!!