మ్యాగజైన్ కోసం మెగా డాటర్ తెగించేసిందిగా...!

మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటి వరకు డజను మంది ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. వారిలో మెగా డాటర్ నిహారిక కొణిదెల ఒకరు. ఈ మధ్య ఆచితూచి చిత్రాలు ఎంపిక చేసుకుంటున్నట్లు కన్పిస్తుంది. గతేడాది విడుదలైన ‘సూర్యకాంతం’ తర్వాత ఆమె మరో చిత్రం చేయలేదు. ‘సైరా నరసింహారెడ్డి’లో గిరిజన యువతి పాత్రలో మెరిసింది. నిహారిక మెగా డాటర్ కాబట్టి సినిమా అవకాశాలు రప్పించుకోవడం పెద్ద కష్టమేమి కాదు. కానీ సొంతంగా కష్టపడి అవకాశాలు తెచ్చుకోవడమే తనకు ఇష్టమని చెబుతోంది. అయితే నిహరికకు సినిమాల్లో అవకాశాలు బాగానే వస్తున్నాయట.. కానీ నచ్చిన పాత్రల్లోనే మాత్రమే నటిస్తానని చెబుతోంది. కాగా కొణిదెల వారసురాలు.. మెగా డాటర్ నిహారిక ఇప్పుడు తన రూటు మార్చేసింది. ఇన్నాళ్లు పద్ధతైన దుస్తుల్లో కనిపించిన ఈమె ఇప్పుడు తన అందాల తలుపులు తెరిచేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటూ ఆ అందాలను వడ్డిస్తోంది. ఆమె పోస్ట్ చేస్తున్న లేటెస్ట్ ఫోటో షూట్స్.. నిహారిక గ్లామర్ ట్రీట్ చూసి మెగా డాటర్ ఈ రేంజ్‌ లో కూడా కిక్కిస్తుందా అని షాక్ అవుతున్నారు నెటిజన్లు.

 

తాజాగా నిహారిక తులిప్ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ చేసింది. ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ అయిన తులిప్ టెన్త్ యానివర్సరీ సందర్భంగా కవర్ పేజీ పై నిహారిక ఫోటో చూస్తే, ఆ విషయంలో కొంచెం హద్దులు దాటినట్టే అన్పిస్తుంది. ఈ ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన మెగా డాటర్.. తులిప్ మ్యాగజైన్ 10వ వార్షికోత్సవ ఎడిషన్‌పై తన ఫోటో ప్రింట్ చేయడం సంతోషంగా ఉందని పేర్కొంది. ఆమె టాప్ క్లివేజ్ అందాలతో రెచ్చిపోయింది. ఈ ఫోటోలో బ్యాక్‌లెస్ పోజిస్తూ కనిపిస్తోంది నిహారిక. మత్తెక్కించే కళ్ళు, ఆమె చూస్తున్న చూపు నెటిజన్ల గుండెల్లో గుచ్చుకుంటోంది. ఇన్నాళ్లు పద్దతిగా కెమెరా ముందు కనిపించిన నిహారిక.. ఇక సినిమాలు, వెబ్ సిరీస్ ఏదైనా అందాలు ఆరబోసేందుకు రెడీ అని అంటోంది. గ్లామర్ రోల్స్ చేస్తానని, కథ డిమాండ్ చేస్తే అందాల విందుకు వెనుకాడేది లేదని చెబుతోంది. మరి ఈమె అందాల ప్రదర్శన మెగా అభిమానులకు కోపం తెప్పిస్తుందేమో.. తాజా ఫోటోలపై వారు ఎలా స్పందిస్తారో చూడాలి. 

 

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Happy to be featured in the 10th anniversary edition of @tulipmag Congratulations guys! @masuu20

A post shared by {{RelevantDataTitle}}