రైతుల కథ చెప్పడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నా అంటూ ఇన్స్టా లో వీడియో షేర్ చేసిన రేణు దేశాయ్

రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే కాకుండా మంచి నటిగా కూడా ప్రేక్షకులకు తెలుసు. పవన్ కళ్యాణ్ 'బద్రి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత 'జానీ' సినిమాలో నటించి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్. కానీ పవన్ కళ్యాణ్‌తో పరిచయం.. ఆయనతో సహజీవనం.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడంతో సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తరవాత రేణు దేశాయ్ తన ఇద్దరు పిల్లలతో కలిసి పుణేలో ఉంటోంది. ఏడేళ్ల కింద పవన్ నుంచి దూరమైన తర్వాత మళ్లీ సినిమాలపై ఫోకస్ చేసింది రేణు. ఈ క్రమంలోనే సొంత భాష మరాఠీలో 'ఇష్క్ వాలా లవ్' అనే సినిమాను తెరకెక్కించింది. దర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకున్న రేణు.. తెలుగులో కూడా సినిమాలు చేస్తానని అనౌన్స్ చేసింది. ఇప్పుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే పనిలో పడింది ఈమె. దర్శకురాలిగానే కాకుండా నటిగానూ నిరూపించుకోడానికి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతుంది రేణు దేశాయ్. దీనికోసం త్వరలోనే తాను రైతుల సమస్యలతో సినిమా చేయబోతున్నానని.. నిర్మాతలతో చర్చల కారణంగా తాను హైదరాబాద్‌లో ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయని గతంలో రేణు దేశాయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

 

ఇప్పుడు తాజాగా రైతుల మీద తీసిన వీడియోకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వివరాలను తెలియజేసింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఒక గ్లిమ్స్ పోస్ట్ చేసింది. దీంతో పాటు ''మా రైతుల కథను మీకు త్వరలో అందించాలని ఆతృతగా ఎదురుచూస్తున్నాము.. ఈ సందర్భంగా నేను అక్కడి పిల్లలు తీసుకొనే ఆహరం మరియు పోషణ గురించి అడిగాను.. ఆ పిల్లలు మేము చాలా స్ట్రాంగ్ అని చెప్పారు. వాళ్ళతో కొంచెం సేపు ఆడుకుందాం అనుకొని నాతో కుస్తీ పట్టి మీ బలం నిరూపించుకోమని చెప్పాను... ఈ ఫిల్మ్ నా మనసుకు దగ్గరైన వన్ అండ్ ఓన్లీ ఫిల్మ్'' అంటూ కామెంట్ జత చేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. కొడుకు అకీరా నందన్ - కూతురు ఆద్యలకి తండ్రి దూరంగా ఉన్నా ఆ లోటు తెలియనీయకుండా పెంచుతోంది రేణు. సినిమాలకు దూరమైనా సోషల్ మీడియాలో అభిమానులకు టచ్ లో ఉంటూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. ఏదేమైనా రేణు దేశాయ్ తన జర్నీని సక్సెస్ ఫుల్ గా కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

 

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Sincerely looking forward to getting this story of our farmers to you {{RelevantDataTitle}}