ఓరి నాయనో.. మొబైల్ ఫోన్ జేబులో పెట్టుకుంటే.. అంగస్తంభన సమస్య వస్తుందా?

praveen
ఊపిరి తీసుకోవడం.. ఆహారం తినడం.. నీళ్లు తాగడం లాంటివి ప్రతి మనిషి రోజువారి జీవితంలో ఎలా అయితే భాగమైపోయాయో.. ఇక మొబైల్ వాడటం కూడా అలాగే భాగం అయిపోయింది. అయితే ఇవన్నీ చేయకుండా ఎలా అయితే మనిషి ఉండలేడో.. ఇక ఇప్పుడు మొబైల్ వాడకుండా ఉండలేక పోతున్నాడు. మొబైల్ లేని ప్రపంచాన్ని ఊహించుకోగలరా అంటే ఇక ప్రతి ఒక్కరు కూడా ఆ ఊహ ఎంత భయంకరంగా ఉందో అని చెబుతూ ఉంటారు  అంతలా ఇక మొబైల్స్ కి బాగా ఎడిక్ట్ అయిపోయారు మనుషులు. అయితే ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా మొబైల్ దగ్గర ఉండాల్సిందే. ఇక చాలామంది తమ మొబైల్ ని ప్యాంట్ జోబు పాకెట్లో పెట్టుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇలా ప్యాంటు జోబులో మొబైల్ పెట్టుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందట. ఏకంగా పురుషుల్లో సంతనోత్పత్తిపై ఇలా మొబైల్ పాకెట్లో పెట్టుకోవడం ప్రభావం చూపుతుందట. స్పెర్మాటోజోవా అనే కణాల పెరుగుదలకు ఆటంకం కలిగిస్తుందట ఈ అలవాటు. స్పర్మ్ కౌంట్ తగ్గి ఇక పిల్లలు పుట్టడం కష్టతరం అవుతుందట. ఏకంగా ప్యాంట్ జోబులో సెల్ఫోన్ పెట్టుకోవడం కారణంగా ఇక వృషకణాలలో ఉత్పత్తయ్యే స్పెర్మ్ పరమ సంఖ్యను తగ్గిస్తుందట. అంతేకాదు ఏకంగా అంగస్తంభన సమస్యలు కూడా వస్తాయట.

 మొబైల్ ఫోన్లో సిగ్నల్ స్వీకరించడానికి ప్రసారం చేయడానికి నాన్ అయోనైజింగ్ రేడియేషన్ విడుదల చేసే రేడియో తరంగాలు ఉపయోగిస్తాయి. ఇక దీనికోసం మొబైల్ లోపల యాంటీనాను అమరుస్తారు. ఈ యాంటిన శరీరానికి దగ్గరగా ఉంటే కేంద్రీకృతమైన తరంగాలను శరీర కణజాలం కూడా గ్రహించే అవకాశం ఉంటుంది. అందుకే జేబులో ఉంచుకోకుండా ఎక్కువసేపు మొబైల్ ని చేతిలో పట్టుకోవడమే బెటర్ అని సూచిస్తున్నారు నిపుణులు. ప్రతిరోజు నాలుగు గంటలకంటే ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్లో మునిగిపోతే మానసిక ఆరోగ్యం సరిగా ఉండదట. మానసిక రుగ్మతలు, నిద్రలేమి సమస్యలు, కంటి సమస్యలు, పలు రకాల డిసార్డర్లు  లాంటివి కూడా వస్తాయి. ఇక ఇలా మొబైల్ ని నాలుగు గంటల కంటే ఎక్కువ ఉపయోగించడం వల్లే ఒత్తిడి పెరిగి ఆత్మహత్య ఆలోచనలు, మాదకద్రవ్యాల వినియోగం లాంటి ఎక్కువ అవుతున్నాయని ఇటీవల నిర్వహించిన ఒక పరిశోధనలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: