మనోజ్ ఇచ్చిన షాక్‌తో ఆస్పత్రిలో చేరిన మోహన్‌బాబు?
మంచు మనోజ్ ఇంట్లోకి వెళ్లిన సమయంలో అనేక నాటకీయ ఘటనలు జరిగాయి. లోపలికి వెళ్లిన కొద్దిసేపటికే ఆయన చిరిగిన చొక్కాతో బయటకు వచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికి మోహన్‌బాబు కూడా బయటకు వచ్చారు. మోహన్ బాబును మీడియా ఏదో ప్రశ్నలు అడగబోగా.. ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. అంతే.. మీడియా మైకుతోనే ఆయన మీడియా ప్రతినిధులపై విరుచుకుపడ్డారు.
మోహన్ బాబు మీడియాపై దాడి చేయడం సంచలనం సృష్టించింది.
ఆ తర్వాత ఆయన పేరుతో ఓ ఆడియో విడుదలైంది. ఆ తర్వాత మోహన్ బాబు ఆస్పత్రిలో చేరినట్టు తెలిసింది. తన నివాసం వద్ద జరిగిన ఘర్షణ అనంతరం మోహన్‌బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి వెళ్లి చేరారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తున్నా.. అనారోగ్యం ఏంటన్నది మాత్రం తెలియరాలేదు.
వరుస ఘటనలతో వచ్చిన ఇబ్బందులు, విచారణ నుంచి కాస్త రెస్టు కోసమే ఆయన ఆస్పత్రిలో చేరారన్న వాదన కూడా ఉంది. ఆస్పత్రిలో మోహన్‌బాబు వెంట ఆయన పెద్ద కుమారుడు విష్ణు ఉన్నారు. ఇప్పటికే మోహన్‌బాబు చిన్న కుమారుడు మనోజ్ కూడా మొన్న కాలికి గాయంతో ఆస్పత్రికి వెళ్లి వచ్చారు. ఈ మొత్తం ఘటనలో మనోజ్‌కు సానుభూతి రాకుండా చేసేందుకే ఆయన ఆస్పత్రిలో చేరారా.. లేక వరుస ఘటనలతో కలత చెంది మానసిక ప్రశాంతత కోల్పోయి అనారోగ్యం పాలయ్యారా అన్నది తేలాల్సి ఉంది. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి బయటకు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.