కొన్ని సంవత్సరాల క్రితం మాస్ మహారాజా రవితేజ హీరోగా తమన్నా , రాశి కన్నా హీరోయిన్లుగా సంపత్ నంది దర్శకత్వంలో బెంగాల్ టైగర్ అనే పక్క కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా 2015 వ సంవత్సరం డిసెంబర్ 10 వ తేదీన మంచి అంచనాల నడుమ విడుదల అయింది. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదల అయ్యి తాజాగా 9 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఇక ఈ సినిమా విడుదల అయ్యి 9 సంవత్సరాలు పూర్తి అయిన నేపథ్యంలో ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమాకు వచ్చిన లాభాలు ఎన్ని అనే వివరాలను తెలుసుకుందాం.
టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ సినిమాకు నైజాం ఏరియాలో 7.82 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 3.35 కోట్లు , ఉత్తరాంధ్రలో 1.85 కోట్లు , ఈస్ట్ లో 1.42 కోట్లు , వెస్ట్ లో 1.15 కోట్లు , గుంటూరులో 1.51 కోట్లు , కృష్ణ లో 1.22 కోట్లు , నెల్లూరు లో 70 లక్షల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కి 19.09 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.17 కోట్లు , ఓవర్సీస్ లో 1.6 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకి 22.80 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇక బెంగాల్ టైగర్ మూవీ 21.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగగా ఈ సినిమా 22.8 కోట్ల షేర్ కలెక్షన్లను ఫుల్ రన్ లో రాబట్టింది. దానితో ఈ మూవీ కి 1.3 కోట్ల లాభాలు వచ్చాయి. దానితో ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.