ఏపీకి కొత్త టూరిజం పాలసీ.. ఇక పర్యాటకం పరుగులేనా?

Chakravarthi Kalyan
ఏపీ ప్రభుత్వం కొత్త టూరిజం పాలసీ 2024- 2029 ను విడుదల‌ చేసింది. వచ్చే ఐదేళ్లకు పర్యాటక పాలసీ అమల్లో ఉండేలా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఆర్ధిక వృద్ధి, ఉపాధి కల్పన తదితర అంశాల లక్ష్యంగా నూతన విధానం అమల్లోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా కొత్త విధానం ఉండబోతోంది.
ప్రధానంగా ఎకో టూరిజం, క్రూయిజ్ టూరిజం, బీచ్ సర్క్యూట్ లు, బ్యాక్ వాటర్ టూరిజం ను ప్రోత్సహించేలా కొత్త విధానం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించేలా కొత్త విధానం దృష్టి పెడుతుందని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయటంతో పాటు విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించేలా కొత్త పాలసీ రూపొందించారు. పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా కల్పించేలా కొత్త పాలసీ ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: