గేమ్‌ ఛేంజర్‌ : 6 రోజులు.. 10 కోట్లు.. ఆ స్థాయి అందుకోకుంటే కష్టమే..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కియార అద్వానీ , రామ్ చరణ్ కు జోడిగా కనిపించనుండగా , మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ ఉండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

అంజలి , శ్రీకాంత్ , సునీల్ , నవీన్ చంద్ర , జయరాం ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి మూడు పాటలను , ఒక టీజర్ను విడుదల చేసింది. వీటికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి మూడవ పాటగా నానా హైరానా అంటూ సాగే మెలోడీ సాంగ్ ను విడుదల చేసింది. ఇక ఈ సాంగ్ కి విడుదల అయిన తర్వాత చాలా తక్కువ సమయం లోనే అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి రావడం మొదలయింది. దానితో ఇప్పటికే ఈ సాంగ్ కి యూట్యూబ్లో అద్భుతమైన వ్యూస్ దక్కాయి.

ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలోని ఈ సాంగ్ ను 6 రోజుల్లో 10 కోట్లు ఖర్చు పెట్టి చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ చిత్రీకరణ విషయంలో ఈ మూవీ నిర్మాత అయినటువంటి దిల్ రాజు ఖర్చు గురించి ఏ మాత్రం వెనకాడ లేదు అని తెలుస్తుంది. అలాగే శంకర్ కూడా ఈ సాంగ్ అద్భుతంగా రావడం కోసం చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. మరి ఇప్పటికే ఈ సాంగ్ లిరికల్ వీడియోకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. మరి ఈ సినిమాలో ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: