పుష్ప 2: ఆ ఒక్క రికార్డు మాత్రమే మిగిలింది.. పుష్పరాజ్ బ్రేక్ చేసేనా..?

Divya
ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కువగా పుష్ప రాజ్ హవా కనిపిస్తోంది.. భారీ టార్గెట్లో బరిలోకి తెగిన పుష్ప 2 చిత్రం అనుకున్నది సాధించి తీరిందని అభిమానుల సైతం తెలియజేస్తున్నారు. కేవలం ఆరు రోజులలోని 1000 కోట్లు మార్కును సైతం అందుకని మరొకసారి రికార్డ్లను బద్దలు కొట్టింది.. అయితే ఫైనల్ గా ఎంతటి కలెక్షన్స్ రాబడుతుందనే విషయం పైన ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక చర్చ జరుగుతోంది ఇప్పటివరకు ఇండియన్స్ స్క్రీన్ మీద బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రాలలో బాహుబలి-2 సినిమాదే.. అయితే మొదట దంగల్ సినిమా ముందు ఉన్నప్పటికీ ఇండియన్ బిగ్గెస్ట్ చిత్రాలలో బాహుబలి సినిమాదే రెండవ స్థానం.

ఈ సినిమా ఓవరాల్ గా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.. అప్పటివరకు ఇండియా సినిమా ఊహించని స్థాయిలో బాహుబలి 2 రికార్డ్స్ ని సైతం అందుకుంది ఈ సినిమా సక్సెస్ అవ్వడంతోనే అన్ని భాషలలో నుంచి పాన్ ఇండియా సినిమాని తెరమీదకి రావడం జరిగింది. అయితే అలా ఎన్నో పాన్ ఇండియా చిత్రాలు వచ్చాయి కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం బాహుబలి-2 చిత్రాన్ని అందుకోలేకపోయాయి. దీంతో ఏడేళ్లుగా ఇండియన్ హైయెస్ట్ క్రాస్ అన్న రికార్డు కేవలం బాహుబలి-2 చిత్రం పేరు మీదే ఉన్నది.

ఆ తర్వాత అంతటి రికార్డులను ఏ సినిమా కూడా తిరగరాయలేకపోయింది.. ప్రస్తుతం బాహుబలి 2 రికార్డులను సైతం తిరగరాసే సత్తా ఉన్న చిత్రం కేవలం పుష్ప 2 సినిమా అన్నట్లుగా సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.. ఈ సినిమా మొదటి రోజు నుంచి భారీ కలెక్షన్స్ ని సృష్టించింది. తొలివారం కూడా అన్ని రికార్డులను తిరగరాసిన పుష్ప 2 చిత్రం ఆరు రోజులలోనే 1000 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ ఇచ్చింది ఇప్పుడు బాహుబలి 2 రికార్డును కూడా బ్రేక్ చేస్తుంది అన్న డిస్కషన్ కూడా జరుగుతున్నది. ఎందుకంటే బాహుబలి రిలీజ్ అయిన సమయంలో టికెట్ల రేటుతో పోలిస్తే ప్రస్తుతం విడుదలైన పుష్ప 2 విషయంలో టికెట్ల రేటు కాస్త ఎక్కువగానే ఉన్నది అదే పుష్ప2 సినిమాకి బాగా కలిసి వస్తోంది. ఒకవేళ ఈ రికార్డు తిరగ రాస్తే ఒక చరిత్ర పుష్ప 2 చిత్రానికి మిగిలిపోతుంది. మరి ఆ చరిత్ర తిరగరాస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: