పని ఒత్తిడి నుంచి ఉపశమనం అంటూ తెగటి తాగేస్తున్నారా.. దంతాలకు ఎంత హానికరం అంటే...!

lakhmi saranya
చాలామంది ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా ఏదో ఒక స్ట్రెస్ లో ఉంటూనే ఉంటారు. అలాంటి వారు స్ట్రెస్ గా ఉన్నప్పుడు టీ ని తాగుతే తక్షణమే ఉపశ్రమనం లభిస్తుంది. భారతీయులు ఎక్కువ ఇష్టంగా తినే పానీయం టి...మంచం మీదనే టీ తాగి రోజులో దినచర్య మొదలు పెట్టేవారున్నారు. భోజనం లేకపోయినా ఆలస్యం అయినా సరే ఒకటి టి తాగితే చాలు అనే టీ ప్రియులున్నరు. టీ తాగకపోతే తలనొప్పి అంటూ కొంతమంది చెబుతారు. చాలాసార్లు టీ తాగే ప్రియులు పారాహుషార్... ఈ అలవాటు ఆరోగ్యానికి మాత్రమే కాదు మీ దంతాలకు కూడా చాలా హానికరం. ప్రజలు టీ ని ఎంతగా ఇష్టపడతారు అంటే ఉదయం మాత్రమే కాదు పనిచేసే సమయంలో టి,
సంతోషంగా ఉన్నప్పుడు టి, ఒత్తిడికి గురైనప్పుడు టీ తాగుతారు. అంటే మొత్తం మీద టీ తప్పనిసరిగా తీసుకుంటారు. అయితే ఈ టీని ఎక్కువసార్లు తాగటం వలన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అదేవిధంగా ఈ విధంగా టీ తాగటం దంతాలకు కూడా చాలా హానికరం. ముఖ్యంగా పాలున్న టి తాగటం మంచిది కాదు. టీ దంతాలకు ఎలా హానికరమో తెలుసుకుందాము. పని ఒత్తిడి లేదా బద్ధకం నుంచి ఉపశమనం పొందేందుకు తరచుగా టీ ని సేవిస్తాము. ఇలా నిద్రపోయే ముందు కూడా కొంతమందికి టి తాగే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు నిద్రలేమికి కారణం అవుతుంది. అంతేకాదు మానసిక స్థితిలో చిరాకు వంటి సమస్యలకు దారితీస్తుంది. ప్రస్తుతానికి టీ మీ దంతాలకు ఎలా హాని చేస్తుందంటే.
చాలామందికి వేడివేడి టీ తాగే అలవాటు ఉంటుంది. కొంచెం చల్లగా అయినా టీ అంటే ఇష్టపడరు. ఇటువంటి అలవాటు వల్ల దంతాలపై పొర అంటే ఎనామిల్ దెబ్బ తింటుంది. దీని కారణం ఏమిటంటే దంతాల మీద ఎనామిల్ సునీతంగా ఉంటుంది. కనుక అతి వేడిగా లేదా చల్లగా, తీపి లేదా పుల్లని ఏదైనా తిన్నప్పుడు దంతాలలో జలదరింపు అనుభూతి ప్రారంభం అవుతుంది. ప్రతిరోజు ఎక్కువగా టీ తాగితే దంతాల సహజమైన తెల్లని రంగు పోయి... దంతాలు పసుపు రంగులోకి మారుతాయి. ఇలా దంతాలు రంగు మారడానికి కారణం టానిన్ అనే మూలకం టీ లో ఉండడమే ... ఇది దంతాలను పసుపు రంగును తీసుకురాగలదు లేదా అంత అలా పై భాగంలో మరకలను సృష్టిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: