పవన్ కు పోటీగా రాజకీయాల్లోకి అల్లు అర్జున్ ఎంట్రీ

MADDIBOINA AJAY KUMAR
స్టార్ హీరో అల్లు అర్జున్  మంచి సినిమాలతో హిట్ కొడుతూ ప్రేక్షకుల మనసును దోచుకుంటున్నారు. ఇటీవలే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో విడుదలైన పుష్ప 2 సినిమా హిట్ సాధించింది. టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు యావత్ భారతదేశ ప్రేక్షకులు ఈ సినిమాను కొనియాడారు. అయితే సినీ రంగంలో దూసుకుపోతున్న అల్లు అర్జున్ ఇకముందు రాజకీయ రంగంలోకి కూడా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

నేడు అల్లు అర్జున్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ను కలిశారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు మార్గదర్శక సూత్రాల కోసం ప్రముఖ రాజకీయ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయినట్లు తెలుస్తుంది. అలాగే త్వరలో సోషల్ సర్వీస్ ప్రారంబించబోతున్నట్లు సమాచారం. ప్రశాంత్ కిషోర్ సలహాతో అల్లు అర్జున్ పదేళ్లు పాటు బ్లడ్ బ్యాంక్ పెట్టనున్నట్లు సమాచారంతెలుస్తుంది. పదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల కోసం అల్లు అర్జున్ ఇప్పటి నుండే ప్రణాళికా మొదలుపెడుతున్నట్లు చర్చలు జరుగుతున్నాయి.
ఇకపోతే ఇప్పటికే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో రాజకీయ రంగంలోకి అడుగు పెట్టిన విషయం అందరికీ తెలుసు. గతంలో ఆయన యొక్క జనసేన పార్టీ కోసం ప్రశాంత్ కిషోర్ కీలక వ్యూహాలను రూపొందించారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ప్రశాంత్ కిషోర్ ని కలిశారని తెలియడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో పవన్ కళ్యాణ్ కు పోటీగా అల్లు అర్జున్ రాజకీయ రంగంలోకి దిగుతున్నారని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. సినీ రంగంలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అల్లు అర్జున్ ఇప్పుడు రాజకీయాల్లోకి రావడానికి ఎందుకు సిద్దామవుతున్నాడని ప్రజలు అనుకుంటున్నారు. పవన్ పై గెలుపు సాధించేందుకు అల్లు అర్జున్ మాస్టర్ ప్లాన్ తో వస్తున్నాడని తెలుస్తుంది.  మరి అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నడన్న వార్తలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: