మనోజ్ మద్యం సేవిస్తాడా.. మోహన్ బాబు ఆడియో కలకలం..!

Divya
మంచు కుటుంబం వ్యవహారం ఇప్పుడు రచ్చకెక్కింది.. ముఖ్యంగా తండ్రీ కొడుకులైనా మోహన్ బాబు, మనోజ్ ఒకరి పైన ఒకరు పరస్పరం దాడి చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిన్నటి రోజున అర్ధరాత్రి వరకు జల్లిపల్లి వద్ద హై టెన్షన్ నెలకొంది. ముఖ్యంగా మోహన్ బాబు ఇంట్లోకి మనోజ్ ని రానివ్వలేదని.. మనోజ్ ఏకంగా తన బౌన్సర్లతో గేట్ ని బలవంతంగా తోసుకొని లోపలికి వెళ్లారు. మనోజ్ వెంట వచ్చిన మీడియా వారి పై మోహన్ బాబు దాడి చేసినట్లుగా వార్తలు వినిపించాయి. అంతేకాకుండా మంచు మనోజ్ పైన మోహన్ బాబు బౌన్సర్లు కూడా దాడి చేయడంతో చొక్కా చిరిగిపోయిందనే విధంగా వార్తలు వినిపించాయి.

అయితే మనోజ్ కు వార్నింగ్ ఇస్తూ మోహన్ బాబు ఒక వాయిస్ ని రిలీజ్ చేశారు.. అయితే ఇందులో మోహన్ బాబు మాట్లాడుతూ తన ముగ్గురు పిల్లలలో నిన్నే చాలా గారాబంగా పెంచాను.. కానీ నువ్వు నీ భార్య మాటలు విని చెడిపోయావు.. మద్యానికి బానిస అయిపోయావు.. రోజు తాగుతూ చెడిపోతున్నావు.. ఇంట్లో పని వాళ్ళ పైన కూడా దాడులు దాడులు చేస్తున్నావని.. మనకంటే చిన్నవాళ్ళని ఎందుకు కొడతావు.. నా విద్యాసంస్థల పైన పడ్డావు.. అందరిని కొట్టావు మీ అన్నను కొట్టడానికి వస్తావా..? మీ అన్నను చంపాలని చూస్తావా ?రా చూసుకుందాం అంటూ హెచ్చరించారు..

అలాగే నువ్వు నా పరువు తీసావు నా ఇంట్లోకి అడుగుపెట్టే అర్హత నీకు లేదు.. ఇది నా డబ్బు ఇది నా కష్టార్జితం ఆస్తులు ఎవరికీ ఇవ్వాలి ఇవ్వకూడదనే విషయం కూడా అది నా ఇష్టం.. మద్యం తాగి నేను ఎవరిని కొట్టలేదు నేను ప్రజలకు ఏనాడు కూడా అన్యాయం చేయలేదు. మీ అమ్మ నీవల్ల హాస్పిటల్ లో ఉంది.. నేను మీ అమ్మ ఏడుస్తూ ఉన్నాము.. నా పర్మిషన్ లేకుండా ఇంట్లోకి అడుగు పెట్టావు.. అలాగే పోలీస్ లకు ఫిర్యాదు కూడా చేశావు.. రేపు ఎల్లుండో మీ అమ్మని పిలిపించి నీ బిడ్డను తీసుకొచ్చి నీకు అప్పగించేస్తుంది అంటూ ఒక ఆడియో ని లిక్ చేసినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: