తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన స్టార్ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. విజయ్ ఆఖరుగా ది గొట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈయన హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
ఈ సినిమా విజయ్ కెరియర్ లో 69 వ మూవీ గా రూపొందుతుంది. ఇకపోతే విజయ్ కొంత కాలం క్రితమే ఓ రాజకీయ పార్టీని స్థాపించిన విషయం మన అందరికీ తెలిసిందే. దానితో విజయ్ తన కెరియర్ లో 69 వ సినిమా తర్వాత సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్లు , కేవలం రాజకీయాలపై ఫుల్ ఫోకస్ పెట్టబోతున్నట్లు ప్రకటించాడు. ఇకపోతే ఇప్పటికే ఓ రాజకీయ పార్టీని అనౌన్స్ చేసి తన సినిమా కెరియర్ను కూడా ఆపేయబోతున్నట్లు విజయ్ అనౌన్స్ చేయడంతో ఆయన అభిమానులంతా కూడా విజయ్ రాజకీయాల్లో ఫుల్ సక్సెస్ కావాలి అని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే తమిళ నాడు లో మంచి క్రేజ్ ఉన్న పొలిటికల్ పార్టీలన్నింటికీ కూడా టీవీ చానల్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
దానితో విజయ్ కూడా ఆర్ టీవీ ఛానల్ ను సొంతగా పెట్టుకోవాలి అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన సొంత టీవీ ఛానల్ కు సంబంధించిన అనేక పనులను విజయ్ పూర్తి చేస్తున్నట్లు , మరికొన్ని రోజుల్లోనే టీవీ ఛానల్ కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.