మోహన్‌బాబు, విష్ణు, మనోజ్.. ముగ్గురికీ షాక్ ఇచ్చిన సీపీ?
ఇవాళ ఉదయం 10.30 గంటలకు వ్యక్తిగతంగా విచారణ హాజరు కావాలని రాచకొండ సీపీ ఆదేశించారు. జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద జరుగుతున్న వరుస ఘటనల పై రాచకొండ సీపీ విచారణ చేయనున్నారు. జల్ పల్లి లో జరిగిన దాడి ఘటన పై సీరియస్ అయిన రాచకొండ సిపి.. ఇప్పటికే మోహన్ బాబు, మంచు మనోజ్ లైసెన్స్ గన్ లను సీజ్ చేసిన సంగతి తెలిసిందే.
మోహన్ బాబు, మంచు మనోజ్ అంశం మూడు, నాలుగు రోజులుగా మీడియాలో ప్రధానంగా వస్తోంది. పరస్పరం కేసులు పెట్టుకోవడం.. దాడులు చేసుకోవడం.. బౌన్సర్లను మోహరించడం.. నిన్న ఏకంగా మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేయడం.. ఈ ఘటనలతో సీపీ నోటీసులు పంపినట్టు తెలుస్తోంది.